ఈనెల 23న నిర్వహించే ఉల్లాస్ పరీక్షలకు ఏర్పాట్లు
1 min read
జిల్లాలో 7,321 మంది అభ్యాసకులు పరీక్షలు వ్రాసేందుకు 732 పరీక్షా కేంద్రాలు
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద నమోదైన నిరక్షరాస్యులైన వయోజనులకు ఈనెల 23వ తేదీన నిర్వహించే పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఉల్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై వయోజన విద్యా, విద్యాశాఖ, తదితర అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉల్లాస్ కార్యక్రమం కింద అక్షరాస్యత శిక్షణ పూర్తిచేసిన 7,321 మంది ఈ పరీక్షలు వ్రాయనున్నారని అందుకోసం 732 పాఠశాలలు గుర్తించి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేషనల్ ఇస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ వారు ఈనెల 23వ తేదీ ఆదివారం అంగన్వాడీ సెంటర్ లో గానీ, స్ధానిక పాఠశాలల్లో గానీ ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని ఈ మధ్యలో ఏ 3 గంటలైన అభ్యర్ధులు పరీక్షలు వ్రాయవచ్చన్నారు. మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారి – 2, సెర్ఫ్ ఎపిఎం, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, ఈ పరీక్షలను సమర్దవంతముగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, ఐసిడిఎస్ పిడి పి.శారద, డిఇఓ వెంకటలక్ష్మమ్మ, వయోజన విద్యా శాఖ డిడి ప్రభాకరరావు, ఉల్లాస్ నోడల్ అధికారి,ఆర్. విజయ కుమార్ పాల్గొన్నారు.
