PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రయివేట్,కార్పొరేట్ పాఠశాలలకు కళ్లెం వేయడం మరిచారా?

1 min read

సిబ్బందితో ప్రచారం,టార్గెట్స్ ను నిలుపుదల చేయాలి

ఎన్నికల పేరుతో చోద్యం చూస్తున్న విద్యాశాఖ అధికారులు

 పిడిఎస్ఓ విమర్శ

పల్లెవెలుగు  వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో రోజు రోజుకు ప్రయివేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ప్రభిత్వా జీఓ లను తుంగలో తొక్కుతున్నాయని ఇది సిగ్గుమాలిన చర్య అని pdso జిల్లా ఉపాధ్యక్షులు సురేంద్ర బాబు విమర్శించారు. ఈసందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందస్తు అడ్మిషన్లను అరికట్టడంలో ప్రభుత్వ అధికారులు విఫలం చెందారని విమర్శించారు. అదేవిధంగా ప్రయివేటు, కార్పొరేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి టార్గెట్లు ఇస్తూ ఉద్యోగస్తులకు మానసికంగా హింసిస్తున్నారని అన్నారు.ఉద్యోగస్తులను అడ్మిషన్స్ కోసం ప్రచారం నిర్వహించడాని వెంటనే నిలువరించాలని ప్రభుత్వ అధికారులను ఆయన డిమాండ్ చేశారు.వెంటనే ప్రైవేట్,కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్స్ ను ఆపాలని కోరారు.లేనిపక్షంలో పాఠశాలల ముందు ప్రత్యక్ష పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు కార్యదర్శులు వీర ప్రతాప్ ఇమ్రాన్ ప్రేమ్ కుమార్ యుగంధర్ నాయుడు. మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author