PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంతా గప్ చుప్.. పాణ్యం లో గెలుపు ఎవరిది..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : ఈ ఎన్నికలు కాస్త విభిన్నంగా ఉండడం బెట్టింగ్ బాబులకు అంతు చిక్కటం లేదు అసలు ఎవరు గెలుస్తారో చెప్పలేకపోవడం విజయం ఎవరికి అందనంత దూరంలో ఉండడం గెలిచిన స్వల్ప మెజార్టీతో బయటపడే అవకాశాలు ఉండడంతో నియోజకవర్గంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది మూడు లక్షల పైచిలుకు ఓటర్లు ఉన్న పెద్ద నియోజకవర్గం పోలింగ్ వారిగా చూస్తే మొత్తం ఓటర్లు. 3,31,000. 706. మంది. నియోజకవర్గ వారీగా. పోలైన ఓట్లు. కల్లూరు 37, 953 మంది ఓటర్లు ఉంటే. ఓటు వేసిన వారు 33, 303. 87.75% శాతంగా పోల్ పర్సెంటేజ్ నమోదయింది . కల్లూరు టౌన్. లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు. 1, 9039 మంది తమ ఓటు వేశారు. పోలింగ్ శాతం 62. 93 గా నమోదయింది. ఇక ఓర్వకల్ మండలంలో 48, 654  మంది ఓటర్లు ఉన్నారు 42,285 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 86. 91 గా నమోదయింది. గడివేముల మండలం ఓటర్లు 34,635 మంది ఉన్నారు. 30,247 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 87.3 గా నమోదయింది. ఇక పాణ్యం లో 37,198 మంది ఓటర్లు ఉన్నారు. 325 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 86. 9 శాతంగా  నమోదయింది. మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా 2,51000 145 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం. 75.7 గా నమోదయింది.గెలుపు పై ఎవరి ధీమా వారిదే…..ఈనెల 13వ తేదీన జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో అధికార పార్టీ కి చెందిన వైసిపి నేతలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపు పై ఎవరికి  వారే ధీమాగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన వైసిపి నేతలు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తోనే భారీ మెజార్టీతో గెలుస్తామని ధీమాలో ఉన్నారు. అలాగే కూటమినేతలు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలతోనే మరియు రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం మార్పు కోరుతున్నారని వైసిపి ప్రభుత్వం లో అభివృద్ధి జరగలేదని అభివృద్ధి కోసం ఓటింగ్ శాతం పెరగడంతో ప్రజలు సైలెంట్ ఓటింగ్ కూటమికి వేశారని కూటమి పార్టీ నేతలు భావిస్తున్నారు. అధికార వైసీపీ పార్టీ నేతలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలు మాకే ఓటు వేసి ఉంటారని.భావిస్తున్నారనితెలిపారు.ఏదిఏమైనప్పటికీ ఇరు పార్టీ నేతలు బయటికి గంభీరంగా ఒకరికొకరు మేము గెలుస్తామని భావిస్తున్నారు. లోపల మాత్రం ఇరువురు పార్టీ నాయకులకు ఓటమి భయం వెంటాడుతుంది.. గత ఎన్నికలలో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండు శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పవచ్చు. ఈసారి ఎన్నికలలో పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఎక్కువ శాతం ముస్లిం మైనార్టీలలో కొంత ఎక్కువ శాతం కూటమి అభ్యర్థులకు వ్యతిరేకంగా అధికార పార్టీ వైసిపి వైపే మొగ్గు చూపారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మహిళలు దాదాపు 18 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాల వయసు గల మహిళలు కూటమి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన నెల 1500 రూపాయలు మహిళలకు అందిస్తారనే భావన మరియు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మహిళలకు కేటాయించడంతో మహిళా ఓటర్లు ఎక్కువ శాతం కూటమికి వేశారని  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ గెలుపు పై ఇద్దరి పార్టీ నేతలు బయటికి ధీమాగా ఉన్నప్పటికీ లోలోపల ఓటమి భయం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అటు అధికార పార్టీ వైసీపీ నాయకులు మేమే గెలుస్తామంటూ ధీమాగా ఉండగా కూటమి నేతలు మేము గెలుస్తామంటూ బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ప్రధాన పార్టీలైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కూటమి పైనే రసవత్తరంగా పోట పోటీ జరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పార్టీ నేతలు భవితవ్యం, కూటమి అభ్యర్థుల బహితవ్యం ఈవీఎంలు దాగి ఉంది. జూన్ 4వ తేదీన ఇరువురు పార్టీకి చెందిన రాజకీయ నాయకుల భవిష్యత్తు బయట పడునున్నది. అంతవరకు రాజకీయ నాయకులు వేచి ఉండాల్సిందే. ఇరువురు పార్టీ చెందిన నాయకుల గుండెల్లో టెన్షన్ నిలుకొని ఉంది. ఏది ఎలా ఉన్నా నాలుగో తేదీ వరకు నాయకుల జాతకాలు ఈవీఎం పెట్టలో భద్రపరిచి ఉన్నాయి నాలుగో తేదీ సాయంత్రం పాణ్యం గడ్డ ఎవరిదో తెలుస్తుంది. వేచి చూడాలి మరి.

About Author