NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్నికల హామీలను మరచిన ప్రభుత్వం..

1 min read

ఎక్కడ చూసినా అరెస్టులే తప్పా ఏమీ లేవ్

కూటమి ప్రభుత్వంపై డాక్టర్ సుధీర్ ఫైర్..

నందికొట్కూరు, న్యూస్​ నేడు: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని నందికొట్కూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ అన్నారు.మంగళవారం నందికొట్కూరు పట్టణంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో డాక్టర్ సుధీర్ ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.ఈనెల 12వ తేదీన జరగనున్న యువత పోరు అనే పోస్టర్లను రాష్ట్ర నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు ఆయన విడుదల చేశారు. తర్వాత ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి మెగా డీఎస్సీ మరియు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఏమి చేయలేదని విద్యార్థులు తల్లిదండ్రులు నిరుద్యోగులు మెడికల్ సిబ్బంది 12వ తేదీన నంద్యాలలో జరిగే ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.17 మెడికల్ కాలేజీలు జగన్ మంజూరు చేస్తే వాటిని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారని ప్రజా సంక్షేమంలో ఒక్క సంక్షేమ పథకం అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు.ఎక్కడ చూసినా అరెస్టులు, మానభంగాలు తప్పా ఏమీ లేవని ఫైర్ అయ్యారు.విద్యను నిర్వీర్యం చేస్తున్నారని గత ఐదేళ్లలో 79 వేల కోట్లు నవరత్నాలకు వైసిపి ప్రభుత్వం కేటాయించిందని ఇప్పుడు మాత్రం కోటి 29 లక్షల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వీటిని ప్రజలు గమనించాలని అన్నారు.ప్రజలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వానికి అవకాశం కల్పించారని వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వంతోనే ఉంటుందని ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మన్సూర్ అహ్మద్‌,జెట్‌పిటిసి సోముల సుధాకర్‌ రెడ్డి,కౌన్సిలర్‌ నాయబ్‌,వైసిపి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి మాదురి గౌడ్‌,మండల కన్వీనర్లు పుల్యాల నాగిరెడ్డి,తువ్వా లోకేశ్వర రెడ్డి,తోకల కృష్ణారెడ్డి,సుధాకర్‌ రెడ్డి,అశోక్‌ రెడ్డి,వైసిపి జిల్లా నాయకులు తిరుమల్‌ రెడ్డి,కాటం వెంకటరమణ,నాగ శేనారెడ్డి,మాజీ సోసైటీ చైర్మన్‌ తులసిరెడ్డి,అబుబక్కర్‌,నారాయణ రెడ్డి,మల్లికార్జున రెడ్డి,చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.

About Author