NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిని చెల్లిని గెంటేసిన జగన్ కు మహిళలను అక్కా చెల్లెలు అనే అర్హత లేదు

1 min read

మహిళా సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి 432 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం, న్యూస్​ నేడు : స్వంత తల్లి ని, చెల్లి ని గెంటేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలను అక్క చెల్లమ్మ అనే అర్హత లేదని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  ఆవిర్భం నుండే తెలుగుదేశం మహిళా సాధికారతకు అత్యంత ప్రధాన్యత ఇస్తూ వచ్చిందన్నారు. ఇంటిని సమర్థవంతంగా నడిపే మహిళలు రాజకీయాల్లోనూ మరింత రానించి సత్తా చాటగలగానే గుర్తించిన  ఎన్టీఆర్  పురుషులతో సమానంగా మహిళలకు ఆస్తి హక్కును కల్పించడం జరిగిందన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  మహిళల ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పథకానికి శ్రీకారం చుట్టి వారి జీవన స్థితిగతులను మార్చారని తెలిపారు.  మహిళల పేరు మీద ఇల్లు పట్టాలు ఇంటి నిర్మాణం భూమి కొనుగోలు వంటి పథకాలు ఎన్నో ఆచారనాత్మకంగా అమలు చేసి చూపించారని తెలిపారు.  కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ 2025-26 బడ్జెట్లో మహిళా శిశు సంక్షేమానికి రూ 4332 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. అదే వైసిపి ప్రభుత్వం లో ఉచితంగా ఇల్లు ఇస్తానని నమ్మించి మాట తప్పి ఓటిఎస్ పేరుతో ఒక్కో మహిళల దగ్గర రూ 10,000 నుంచి 30,000 వేలు వరకు బలవంతంగా వసూలు చేశారని విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం. 2014-19 టిడిపి ప్రభుత్వంలో ఆడబిడ్డకు అండగా నిలిచేందుకు తెచ్చిన పెళ్ళి కానుకను 2019-24 లో రద్దు చేసిందని తెలిపారు. దిశ పేరుతో డ్రామ తప్ప జగన్ పాలనలో ఆడబిడ్డకు రక్షణగా నిలిచిన రక్షణ వ్యవస్థ అసలు లేనేలేనిదని అన్నారు. గడిచిన ఐదేళ్లలో 0 వడ్డీ రుణాలు పరిమితి 3 లక్షలు కాగా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని 5 లక్షలకు పెంచి అలాగే ఈ వడ్డీ రాయితీ రుణాలను కూటమి ప్రభుత్వం త్వరలో 10 లక్షల రూపాయలకు పెంచడం జరుగుతుందని తెలిపారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనారిటీ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసేలా పెట్టుబడి రాయితీని 35% నుంచి 45% కు పెంచిన ఘనత మా కూటమి ప్రభుత్వందే అన్నారు. అలాగే ఎన్నికల హామీలో బాగంగ ప్రభుత్వం అంగన్వాడి ఆశావర్కర్లు ఎన్నాళ్ళగా ఎదురుచూస్తున్న గ్రాట్యుటీ చెల్లింపులకు శ్రీకారం చుట్టి అంగన్వాడీ గ్రాట్యూటీ చెల్లింపుల కోసం బడ్జెట్లో 60 కోట్ల కేటాయించిన ఏకైక కూటమి ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *