ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రయివేట్ కార్పొరేట్ పాఠశాలలను సీజ్ చేయాలి
1 min readఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఈరేష్ డిమాండ్ చేశారు
పల్లెవెలుగు వెబ్ కౌతాళం : మండల కేంద్రమైన ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కౌతాళం మండలంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు మంజునాథ్ అధ్యక్షతన ఏఐఎస్ఎఫ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఈరేష్ మండల కార్యదర్శి గురుబసవ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ముందస్తుగా అడ్మిషన్లు చేపట్టడం జరుగుతా ఉందన్నారు విద్యాశాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికే మండలంలో ఒక్క తరగతికి 8 వేల నుంచి 12 వేల రూపాయల వరకు పాఠ్యపుస్తకాలను విద్యాసంస్థల యాజమాన్యులు కొనుగోలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి ముందస్తు అడ్మిషన్లు చేస్తూ పాఠ్యపుస్తకాలముతున్న విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తదితరులు పాల్గొన్నారు.