తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలి : మంత్రి
1 min read
తాగునీటి ఎద్దడి లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారన్న మంత్రి
జలజీవన్ మిషన్ పథకం అమలులో గత ప్రభుత్వం అలసత్వం
నీటి ఎద్దడిపై అధికారులు త్వరితగతిన స్పందించండి
రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు
నంద్యాల, న్యూస్ నేడు: వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా పటిష్ఠమైన నివారణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో వేసవి తీవ్రత దృష్ట్యా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో సరఫరా చేయాల్సిన త్రాగునీటి సరఫరాపై ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితరెడ్డి, నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, జిల్లా పరిషత్ సీఈఓ నాసర రెడ్డి, డిఆర్ఓ రామునాయక్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో త్రాగునీటి ఎద్దడిని నివారించడానికి, నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడటానికి ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు పటిష్ట ప్రణాళిక రూపొందించుకొని తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వేసవి కారణంగా ప్రస్తుతం భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న క్రమంలో వచ్చే వర్షాకాలం సీజన్ వరకు ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడం జరిగిందన్నారు. తాగునీటి ఎద్దడిపై స్థానికంగా గ్రామాలలో ఉన్న సమస్యలను ప్రజలు ఎమ్మెల్యేలకు దృష్టికి తీసుకు రావడం జరిగిందన్నారు.
తాగునీటి సమస్యలకు ప్రత్యామ్నాయం సిద్ధం చేసుకోవాలి
రేపు రాబోయే కాలంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా అధికారులు చూడాలన్నారు. వేసవిలో ఒక్కోసారి సడన్ గా భూగర్భ జలాలు తగ్గిపోవడం, బోర్లు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని, అందుకు ముందుగానే ప్రత్యామ్నయం చూసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుదన్నారు. అలా ముందస్తుగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక రెండు రోజుల్లో పరిష్కరించవచ్చన్నారు. నీటి ఎద్దడి వంటి సమస్యలు తలెత్తినప్పుడు ఉద్యోగుల అశ్రద్ధ అలసత్వం వహిస్తే, ప్రజలు ఇబ్బంది పడితే అంతిమంగా అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు కారణం అవుతుందన్నారు. తాగునీటి ఎద్దడి లేకుండా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి భరోసాతాగునీటికి సంబంధించి ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని, నిధుల విషయం ఆలోచించవద్దని ఈ విషయంలో ముఖ్యమంత్రి సైతం భరోసా ఇచ్చారన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై కలెక్టర్, శాసనసభ్యులు దృష్టికి తీసుకువస్తే తగిన నిధులు కేటాయించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ట్యాంకుల్లో వంద శాతం నీరు నింపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత నందికొట్కూరు మున్సిపాలిటీకి సుమారుగా 30 లక్షల రూపాయలకు త్రాగు నీటి కోసం ఇవ్వడం జరిగిందన్నారు. ఎర్రగూడూరు మండల పరిధిలో త్రాగునీరు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
