NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వీఆర్​ఓ ల సమస్యల్ని పరిష్కరించిన తరువాత రేషనలైజేషన్ చేపట్టాలి

1 min read

రెండు సచివాలయలకు ఒక వీఆర్​ఓ పై ప్రభుత్వం పునరాలోచించాలి

జిల్లా కార్యవర్గం లోని వీఆర్​ఓ లకు పదోన్నతులు, నూతనంగా కార్యవర్గం ఎన్నిక..

కర్నూలు, న్యూస్​ నేడు: ఆంధ్రప్రదేశ్  ఉమ్మడి కర్నూలు జిల్లా గ్రామ రెవిన్యూ అధికారుల కార్యవర్గ సమావేశము స్థానిక అసోసియేషన్ కార్యాలయం లో  రాష్ట్ర కోశాధికారి & ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షుడు  ఎ.మౌళిభాషా  అధ్యక్షతన  ఆదివారం ఉదయం 10.30 గం.లకు జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు  ఎ.మౌళి భాషా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన రేషనలైజేషన్ ప్రక్రియను గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కరించి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించిన తరువాత మాత్రమే రేషనలైజెషన్ ప్రక్రియ చేపట్టాలని  ప్రభుత్వాన్ని కోరారు. మరియు రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్​ఏ పోస్టులను అర్హులైన వీఆర్​ఓ లచే వారి అభిప్రాయం మేరకు భర్తీ చేయాలని కోరారు. ప్రస్తుతం వీఆర్​ఓ లకు అధిక పని భారం ఉంది. ప్రస్తుతం సచివాలయాల్లో క్లస్టర్ విధానం తీసుకువస్తే పది వేల ఎకరాలు నుండి 15 వేల ఎకరాలకు ఒకే వీఆర్​ఓ విధులు నిర్వహించాల్సి వస్తుంది. అలాగే మిగిలిన ఇతర పనులు అన్నికలిపి రెండు& మూడు సచివాలయాలకు ఒక వీఆర్​ఓ ఉంటే మరింత పని భారం పెరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని ప్రభుత్వం మరొక్క సారి పునరాలోచించాలని తెలియజేసారు. అదేవిదంగా రాష్ట్రంలో వీఆర్​ఓ ల పనితీరు మరియు అవినీతి పై ఐవీఆర్​ఎస్​  ద్వారా పిర్యాధులు తీసుకోవడాన్ని ఖండించారు. ఈ చర్యల వల్ల నిజాయితీగా పనిచేసే వీఆర్​ఓ ల ఆత్మ గౌరవం దెబ్బతిసే విధంగా ఉన్నాయని తెలియజేశారు. రీ సర్వే లో జరిగిన పొరపాట్ల వలన ఐవీఆర్​ఎస్​ లో వీఆర్​ఓ లపై తప్పుగా ఫీడ్ బ్యాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా.రెవిన్యూ రికార్డులలో మార్పులకు వీఆర్​ఓ ఒక్కరినే బాధ్యుడిగా చేయడం చాలా దుర్మార్గంఅని అభిప్రాయపడ్డారు. మొన్న పదోన్నతులలో  కార్యవర్గంలోని వీఆర్​ఓ లు సీనియర్ సహాయకులుగా వెళ్లినందున వారి స్థానంలో  ఉమ్మడి కర్నూలు జిల్లా కమిటీప్రధాన కార్యదర్శి హనుమంత రావు స్థానంలో కోఅప్షన్ పద్ధతి లో కర్నూలు డివిజన్ అధ్యక్షుడు శ్రీ ఆర్.నర్సరాజు ని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేశారు. అలాగే ఉపాధ్యక్షి డిగా ఆదోనికి చెందిన శ్రీ అల్లా బకాష్ ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ నర్సరాజు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఆర్​ఓ ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా అధ్యక్షులు శ్రీ ఎ మౌళిభాషా, కోశాధికారి కె శ్రీధర్, రాష్ట్ర ఈ.సి మెంబర్ తిరుమల రెడ్డి మరియు ఆదోని డివిజన్ అధ్యక్షులు శ్రీ నారాయణ రెడ్డి, ఉపాధ్యక్షులు బుద్ధకవి, ఖాజా హుసేన్, కర్నూల్ డివిజన్కార్యదర్శి రాజు మరియు మండలఅధ్యక్ష కార్యదర్శులు మరియు ఉమ్మడి కర్నూలు జిల్లా లోని గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

About Author