వట్లూరు యంపిపి పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
1 min read
పాఠశాలలో చదువులు, వసతులు తదితర అంశాలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్
పాఠశాలపిల్లల విద్యా బోధనపై ఆరా
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పెదపాడు మండలం వట్లూరు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడి పిల్లలతో కలెక్టర్ మమేకమై వారి విద్యాభోదనపై ఆరాతీశారు. పిల్లలతో కలిసికూర్చొని వారి పాఠ్యపుస్తకాలను పరిశీలించి అందులోని అంశాలను, బాల బాలికలతో చదివించారు. ఈ సందర్బంగా వారు చెప్పిన సమాధానాలకు కలెక్టర్ ముచ్చటపడుతూ పిల్లలను అభినందించారు. అకడమికల్ గా బెస్ట్ స్కూల్ గా ఉన్న ఈ పాఠశాల మరింత ఉన్నత ప్రమాణాలతో పిల్లలకు విద్యాభోదన అందించాలన్నారు. అనంతరం విద్యార్ధుల హాజరుపట్టీని కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలకు మంగళవారం 27 మంది బాల బాలికలకు గాను, 18 మంది హాజరుకావడం గుర్తించారు. ఒక విద్యార్ధి కొంతకాలంగా పాఠశాలకు రానప్పటికీ హాజరు నమోదుచేయడంపై సంబంధిత ఉపాధ్యాయుడు, తనికీ చేయవల్సిన ఎంఇఓను కలెక్టర్ మందలించారు. ఇటువంటి సంఘటనలు పునరావతమైతే శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వి. సావిత్రి, ఉపాధ్యాయుడు జి.వి. రంగమోహన్ లను పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి బోజనం అమలు తీరును ఆరాతీశారు. విద్యార్ధులకు నాణ్యమైన భోజనం, వసతి సౌకర్యాలు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. వీరి వెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, యంపిడివో అమిల్ జామ, ఎంఇఓ ఎస్. నరసింహమూర్తి, తదితరులు ఉన్నారు.