హిందూ యువతకు మార్గనిర్దేశం చేసేది బజరంగ్ దళ్ మాత్రమే
1 min readభాగ్యనగర్ క్షేత్ర సంఘటనా మహామంత్రి గుమ్మళ్ళ సత్యం జీ…..
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గతనెల 27 నుండి ఈ నెల 2 వ తేదీ వరకు మాంటేస్సొరి ఇండస్ పాఠశాల లో బజరంగ్ దళ్ దక్షిణాంధ్ర ప్రదేశ్ శౌర్య ప్రశిక్షణా శిబిరము జరుగుతున్న సందర్భంగా ఈరోజు 1/6/24, శనివారం రోజున కర్నూలు నగరంలోని ప్రముఖులు, కుల సంఘాల నాయకులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు తదితరుల పాల్గోనగా జరిగిన “*సార్వజనికోత్సవము” సభలో గత 7 రోజులుగా దక్షిణాంధ్ర ప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుండి వచ్చిన 200 యువకులు ఇక్కడ నేర్చుకున్న వివిధ రకాల శారీరక వ్యాయామాలు,నియుధ్ధ (కరాటే), దండ(కర్రసాము), బాద(సాహసకృత్యాలు), ఎస్టీ(లాఠీ ప్రయోగం), లక్ష్యబేధ్(షూటింగ్) సూర్యనమస్కారాలు వంటి స్వీయరక్షణయుద్ధవిద్యలు,అధ్భుతంగా ప్రదర్శించారు.అనంతరం జరిగిన సభలో విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర (ఉత్తరాంధ్ర,దక్షిణాంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు) సంఘటనా మహామంత్రి(కార్యదర్శి) గుమ్మళ్ళ సత్యం జీ మాట్లాడుతూ ఏదేశ ప్రగతి నైనా నిర్దేశించేది ఆ దేశపు యువతేనని, ప్రపంచం లోనే అత్యధికంగా యువకులు కలిగిన దేశం భారతదేశమని కానీ ఈ దేశంలో యువత రాజకీయ, సామాజిక, కారణాలతో వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తు నిర్వీర్యం అవచవడం శోచనీయమని, దీనికిక చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్న మైందనీ హనుమాన్ చాలీసా లో చెప్పినట్టు రామ కార్య కరివకో ఆతుర అంటే రామ కార్యం కోసం హనుమంతుడు ఎలాగైతే సమర్పణా భావంతో ముందుకు ఉరికాడో….అలాగే హిందూ సమాజానికి వచ్చే అన్ని ఆపదలనూ తీర్చడం కోసు బజరంగ్ దళ్ కార్యకర్త ముందుకు ఉరుకుతాడని అటువంటి యువత అన్నిరంగాల్లో ముందుకు దూసుకెళ్ళి అవకాశాలను అందిపుచ్చుకొని ప్రగతి పథంలోకి దూసుకెళ్లాలని దీని కొరకు వ్యసనముక్తభారత్ ఉద్యమం యొక్క అవసరం ఉన్నదని దీనిలో భాగంగా యువకులను తాగుడుకు బానిసలు కాకుండా చూడటం, విపరీతమైన “సెల్ ఫోన్” వాడకం,మన సనాతన ధర్మం పాటించక పోవడం, మన మానబిందువులైన భారతమాత, భూమాత, గంగామాత, గోమాత , ధర్మగ్రంథాల రక్షణ, వంటి వాటిని విస్మరించడం వంటి నుండి హిందూ యువతను సంస్కరించి తిరిగి గాడిలో పెట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఇలా వారం రోజులపాటు బజరంగ్ దళ్ శౌర్యప్రశిక్షణ శిబిరాలు జరిపి బజరంగ్దళ్ ధ్యేయ వాక్యాలైన” సేవా సురక్ష సంస్కార్ ” వంటి వాటిఆలంబనగా ఇక్కడ శిక్షణ కోసం వచ్చిన యువకులకు చక్కగా శిక్షణనిచ్చి వారు తిరిగి తమ తమ కార్యక్షేత్రాలలో హిందూ యువకులను సంస్కరించి దేశం కోసం ధర్మం కోసం పనిచేసేలా తయారు చేయాలని పిలుపునిచ్చారు.మరో ముఖ్య అతిథి కర్నూలు జిల్లా, నంద్యల జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ, విష్ణువర్ధన్ రెడ్డి గార్లు ఈ శౌర్యప్రశిక్షణా వర్గలో పాల్గొన్న కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు, ఇక్కడ శిక్షణతో మీ పని ప్రారంభమైంది నీ మీ ప్రాంతాల్లో బజరంగ్ దళ్ యోక్క సైన్యాన్ని పెంచే పని చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్, బజరంగ్ దళ్ తూంకుంట ప్రతాప రెడ్డి, కో కన్వీనర్ పోలేపల్లి సందీప్, ప్రాంత టోలి సభ్యులు పెంచల్ రెడ్డి, రవీ,శశికుమార్, కమ్మయ్య, పిచ్చయ్య,విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ,ఆర్.యస్.యస్. విభాగ్ కార్యకొరిణీ సభ్యులు సుబ్బలక్ష్మయ్య, విశ్వ హిందూ పరిషత్ విభాగ్ ధర్మప్రసార్ కన్వీనర్ కాళంగిరి విజయుడు,జిల్లా కార్యదర్శి మాళిగి భానుప్రకాష్ సహకార్యదర్శులు గూడూరు గిరిబాబు, ఈపూరి నాగరాజు, నంద్యాల జిల్లా సహకార్యదర్శి రామకృష్ణ,జిల్లా ప్రసార ప్రచార కన్వీనర్ రామకృష్ణ, అడ్వకేట్ లు, డాక్టర్లు, భాజాపా నాయకులు బి.వీ.సుబ్బారెడ్డి, చామకూర వీరప్ప, నాగప్ప, భూపాలాచారి, 145 మంది శిక్షార్థులు పాల్గొన్నారు.