జిల్లాలో పలు విద్యాసంస్థల బస్సులపై 8 కేసులు నమోదు
1 min read
ఉప రవాణా కమిషనర్ షేక్ డిటిసి కరీం
ఫిట్నెస్,పొలేషన్,డ్రైవింగ్ లైసెన్స్ ల పై తనిఖీలు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాలోవిద్యాసంస్థల బస్సులపై 8 కేసులులు నమోదు ఉప రవాణా కమిషనరు షేక్.కరీమ్ ఆదేశాల మేరకు బుధవారం ఏలూరు జిల్లాలోని పలు విద్యా సంస్థల బస్సులను మోటారు వాహనాల తనిఖీ అధికారులు తనిఖీ చేశారు. ఫిట్నెస్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన భీమా తదితర వాటిని పరిశీలించి, 8 బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డీటీసీ కరీమ్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహనాల తనిఖీ అధికారులు ఎస్.బి.శేఖర్, వై.సురేష్ బాబు, వై.ఎస్.వై.కళ్యాణి పాల్గొన్నారు.
