కౌంటింగ్ ఏర్పాట్లకు సర్వం సిద్ధం…
1 min readప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తిస్థాయిలో చేశాం
ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ చేయుటకు గాను అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశాం.
ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడటంలో ప్రతి ఒక్కరూ సహకరించాలి
జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రజల శాంతిభద్రతలకు ఎటువంటి భంగం కలగకుండా, కౌంటింగ్ ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన పేర్కొన్నారు. సోమవారం రాయలసీమ యూనివర్సిటీ లోని మీడియా సెంటర్ లో కౌంటింగ్ ఏర్పాట్లపై ఎస్పీ తో కలిసి జిల్లా కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డా జి.సృజన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 4వ తేదీ జరగబోయే కౌంటింగ్ కొరకు సంబంధించి కౌంటింగ్ హాల్ ఏర్పాట్లు, కౌంటింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణ తరగతులు విషయంలో కావచ్చు, రాయలసీమ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కమ్యూనికేషన్ సెంటర్, అబ్జర్వర్ల సీటింగ్, మొబైల్ డిపాజిట్ సెంటర్ ఏర్పాటు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు, ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఏర్పాటు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ సిస్టం, ఫైర్ సేఫ్టీ, సీసీ కెమెరాల ఏర్పాటు ఈ విధంగా కౌంటింగ్ హాల్ లోపల చేయాల్సిన ఏర్పాట్లు, కౌంటింగ్ హాల్ బయట చేయాల్సిన ఏర్పాట్లు అన్ని పూర్తి చేసుకోవడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.. ప్రతి హాల్ లో రౌండ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ హాల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీడియా వారికి తెలియచేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు .. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణంలో కౌంటింగ్ చేయడానికి గాను సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలను జిల్లా ఎస్పీ గారు తీసుకున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారని, ప్రశాంతతకు భంగం కలిగించకుండా ప్రజల యొక్క నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రక్రియని పూర్తి చేయటంలో అందరూ కూడా సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.జిల్లా యంత్రాంగం, పోలీసుల సమిష్టి కృషితో పోలింగ్ కి ముందు, పోలింగ్ తర్వాత ప్రశాంత వాతావరణం ఉందని, కౌంటింగ్ తర్వాత కూడా ప్రశాంతంగా ఉండేందుకు శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తామని, ప్రజలు కూడా సహకరించాలని కలెక్టర్ కోరారు.జూన్ 4వ తేది రాయలసీమ యూనివర్సిటీ చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల పరిధిలో అన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్, షాపులని మూసివేయడం జరుగుతుందన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో భాగంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.ఈరోజు, రేపు, ఎల్లుండి మూడు రోజులు ఎక్కడ లిక్కర్ అమ్మకాలు అనేవి లేకుండా పూర్తి స్థాయిలో నియంత్రణ ఉంటుందని, లిక్కర్ తో పాటుగా లూజ్ ఫ్యూయల్, పెట్రోల్, డీజిల్ లాంటివి అమ్మే అవకాశం ఉండదని రూల్స్ ని అతిక్రమించి ఎవ్వరైనా అమ్మితే కఠినమైన చర్యలు ఉంటాయన్నారు. అదే విధంగా బాణాసంచా కూడా అమ్మకుండా చర్యలు తీసుకున్నామని, డ్రోన్ ఫ్లయింగ్ వాటికి పర్మిషన్ లేదని కలెక్టర్ తెలిపారు.మీడియా వారికి మీడియా సెంటర్ వరకు మొబైల్ ఫోన్లను అనుమతించడం జరుగుతుందని, అప్పుడప్పుడు కొంతమంది మీడియా వారిని కౌంటింగ్ హాల్స్ లోకి విజువల్స్ తీసుకొనుటకు గాను తీసుకొని వెళ్లడం జరుగుతుందని, అప్పుడు మాత్రం మొబైల్స్ తీసుకొని వెళ్లడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.. మీడియా సెంటర్ లో ఇంటర్నెట్ కనెక్షన్స్ కల్పించామన్నారు. మీడియా ద్వారా ప్రజలకు త్వరగా రిజల్ట్స్ చేరేందుకు గాను మీడియా వారికి టైంలీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు గాను ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి అవసరం ఉన్న ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాల్సిన మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ కౌంటింగ్ రోజున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా భద్రత పరంగా తీసుకోవాల్సిన అని రకాల చర్యలను తీసుకోవడం జరిగిందన్నారు. రెండు రకాల బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, కౌంటింగ్ సెంటర్ వద్ద ఒక బందోబస్తు, కర్నూలు జిల్లాలో సబ్ డివిజన్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మరొక బందోబస్తును ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం 4 అంచెల భద్రత కౌంటింగ్ హాల్ వద్ద ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఎస్పీ పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కౌంటింగ్ హాల్ కి వెళ్ళే ప్రతి ఒక ఈవిఎమ్ కి కూడా ఏఆర్ ఎస్కార్ట్ ఉంటుందన్నారు.. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్ కాకుండా ఏ ఇతర వ్యక్తులు కూడా కౌంటింగ్ సెంటర్ లోకి ప్రవేశించకుండా 3 కట్ ఆఫ్ సెక్యూరిటీ పాయింట్ లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు .. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్ వాహనాలను కౌంటింగ్ హాల్ కి 200 మీటర్ ప్రాంగణంలో వెహికల్స్ పార్క్ చేయించి, మొబైల్ డిపాజిట్ చేసిన అనంతరం ఏఆర్ పోలీస్ టీమ్స్ మరల ఒక్కసారి చెక్ చేసి కౌంటింగ్ హాల్ లోకి పంపిస్తారన్నారు… కర్నూలు జిల్లాలో 144 సెక్షన్, సెక్షన్ 30 యాక్ట్ ఆఫ్ పోలీస్ అమలులో ఉందనే విషయం గురించి పలుమార్లు పబ్లిసిటీ ఇవ్వడం కూడా జరిగిందన్నారు. కర్నూలు జిల్లా ముఖ్యమైన జంక్షన్ లతో పాటు, పల్లెలో కూడా 144 సెక్షన్, సెక్షన్ 30 యాక్ట్ ఆఫ్ పోలీస్ గురించి ప్రచారం చేయిస్తున్నామన్నారు.. ట్రబుల్ మాంగర్స్ అందరిని ఐడెంటిఫై చేసి వారి మూమెంట్ ని కూడా ట్రాక్ చేస్తున్నామన్నారు.. గెలిచిన వారు ఎవరు కూడా ఫైర్ క్రాకర్స్, విక్టరీ మార్చ్ నిర్వహించేందుకు అనుమతులు లేవని తెలిపారు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో సమాచార పౌర సంబంధాల అధికారి జయమ్మ, బిసి సంక్షేమ అధికారి వెంకట లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.