వెంకన్న చెరువు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ లకు వార్షిక మరమ్మతులు
1 min read

ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ కు అంతరాయం
ఆయాప్రాంత వినియోగదారులు సహకరించాలని మనవి
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ కెఎం అంబేద్కర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఈనెల 21వ తేది(శుక్రవారం) ఏలూరు 1వ పట్టణంలో గల వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిదిలో విద్యుత్ లైన్ల వార్షిక మరమత్తుల నిమిత్తం ఉదయం 08:00 గంటల నుండి మధ్యాహ్నం 14:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడును. ఈ సమయములో వెంకన్న ట్యాంక్ సబ్ స్టేషన్ పరిధి లో గల కొత్తగూడెం సెంటర్, 7 కాలవులు సెంటర్, చాటపర్రు రోడ్, తూర్పు వీధి సాయి బాబా గుడి సెంటర్, తూర్పు వీధి గంగానమ్మ గుడి ఏరియా, వీవర్స్ కాలనీ, తూర్పు వీధి, ఫిల్ హౌస్ పేట మరియు మాదేపల్లి రోడ్ పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని, ఆయా ప్రాంత ప్రజలు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.

