NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బ‌హుమ‌తి …ఐదు లీట‌ర్ల పెట్రోల్

1 min read
విన్నర్​కు పెట్రోల్​ అందజేస్తున్న నిర్వాహకులు

విన్నర్​కు పెట్రోల్​ అందజేస్తున్న నిర్వాహకులు

భోపాల్ ; భోపాల్ లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విన్నర్ కి ఐదు లీట‌ర్ల పెట్రోల్ ఇచ్చారు నిర్వాహ‌కులు. ఈ ఘ‌ట‌న ఇపుడు దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ గా మారింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న త‌రుణంలో భోపాల్ లో జ‌రిగిన క్రికెట్ టోర్నీలో ఐదు లీట‌ర్ల పెట్రోల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ప్రక‌టించి వినూత్న రీతిలో నిర‌స‌న తెలిపారు నిర్వాహ‌కులు. అయితే.. ఈ టోర్నీ కాంగ్రెస్ నేత మ‌నోజ్ శుక్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వంద‌కు చేరువ‌వుతున్న నేప‌థ్యంలో వ్యంగాస్ర్తం సంధించారు కాంగ్రెస్ నేత‌. ఇప్పుడు ఇది దేశ‌వ్యాప్తంగా వైర‌ల్ అయ్యింది. నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు పెడుతున్నారు.

About Author