శ్రీరామలయ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని మెయిన్ బజార్లో వెలసిన శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం జరిగిన శ్రీ సీతారాముల దివ్య మంగళ రథోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆలయ కమిటీ తో పాటు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. నగరంలోని గడియారం హాస్పిటల్ నుంచి ప్రారంభమైన శ్రీ సీతారాముల రథోత్సవ కార్యక్రమం మేడమ్ వారి సత్రం వరకు కొనసాగింది. శ్రీ సీతారాముల దివ్య మంగళ రథోత్సవం కొనసాగిన రహదారుల్లో జైశ్రీరామ్ నినాదాలు హొ రెత్తాయి. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ నగరంలోని మెయిన్ బజార్ లో వెలిసిన శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు .ఆలయం అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చారని వివరించారు. 1925వ సంవత్సరం నుంచి గత 100 సంవత్సరాలుగా శ్రీ రామాలయం లో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయమని చెప్పారు .తాను కూడా తమ తాత గారి స్వగ్రామమైన తుంబలం గ్రామంలో శ్రీ రాముని ఆలయాన్ని అభివృద్ధి పరచామని చెప్పారు. ఈ ఆలయాన్ని ఐదువేల సంవత్సరాల కిందట పాండవులు నిర్మించినట్లు చరిత్ర చెబుతుందని వివరించారు .అలాంటి ఆలయం ను తాము జీర్ణోదరణ చేసి నిత్యం పూజలు జరిగేలా కృషి చేశామని చెప్పారు. ఎవరైనా తుంబలం గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆలయాన్ని సందర్శించి శ్రీరాముని దర్శించుకోవచ్చు అని వివరించారు. శ్రీ రామాలయం శతాబ్ది బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన రథోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఆనందంగా ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు.