NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మూగజీవాలను అక్రమంగా రవాణా చేసిన చట్టరీత్యా కఠిన చర్యలు

1 min read

జిల్లా పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు 

డా:గోవిందరాజు టేకి 

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : మూగజీవాలను హింసించినా,వధించిన, అక్రమంగా రవాణా చేసినా  చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా:గోవిందరాజు టేకి అన్నారు.మూగజీవాలపై హింస, వదించడం, అక్రమ రవాణా నిర్మూలనపై అవగాహన కార్యక్రమం   గురువారం ఏలూరులోని గన్ బజార్ సెంటర్ ప్రజలు, అధికారులతో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా డా:గోవిందరాజు  మాట్లాడుతూ  బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, దూడలను వధించకూడదని, ఎవరైనా చట్ట విరుద్ధంగా పశువులను రవాణా చేసిన, వధించినా చట్ట ప్రకారంగా చర్యలు ఉంటాయని  హెచ్చరించారు. జంతు రవాణా చట్టం 1978 ప్రకారం పశువులను రవాణా చేయాలంటే పశుసంవర్ధక శాఖ నుండి ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా పొందాలన్నారు. కేంద్ర మోటార్ వెహికల్ చట్టం 2015 ప్రకారం రవాణా శాఖ నుండి ప్రత్యేక లైసెన్స్ పొందిన వాహనములోనే పశువులను తరలించాల్సి ఉంటుందన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, రవాణా శాఖలు వారి డివిజనల్, మండల స్థాయి కమిటీలను అప్రమత్తం చేసి ఆవులు,దూడలు, పెయ్యలను అక్రమంగా జంతు వధకు రవాణా కాకుండా, జంతు వద జరగకుండా చూడాలని ఆయన కోరారు . ఎవరైనా చట్టం ఉల్లంఘించిన ఎడల వారిపై క్రిమినల్  కేసులు నమోదు చేయాలని సంబంధిత అధికారులను  ఆదేశించారు. పశువులను విచ్చలవిడిగా రోడ్లపై వదలడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని,పశు యజమానులకు నోటీసు జారీ చేసి జరిమానా విధించాలన్నారు. జంతు సంరక్షణ కోసం గ్రామ, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  గోవధ నిషేధంచట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి  సంబంధిత శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి జిల్లాలో గోవద జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ రాలీ లో  పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్  డైరెక్టర్  సుబ్రహ్మణ్యం,లక్ష్మీనారాయణ, సుచరిత  మరియు వెటర్నరీ డాక్టర్లు సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

About Author