PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విహెచ్​పి- బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం..

1 min read

విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య….

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పేదవాడైనా…..ధనికుడైనా…….అందరూ ఎకకంఠంతో….చెప్పేమాట ఆరోగ్యమే మహాభాగ్యం ఐతే ధనికుడు కోరితే కోరిన చోట కోరిన వైద్యులతో విలాసవంతమైన ఆసుపత్రులలో వైద్యాన్ని పొందగలరు కానీ బడుగు బలహీన వర్గాల వారు ఖరీదైన వైద్యానికి భయపడి ప్రభుత్వ వైద్యశాల లో సరియైన వైద్యం లభించక దిక్కుతోచని స్థితి ఉన్న ఈ రోజుల్లో విశ్వహిందూ పరిషత్ కేంద్ర సమితి ఆదేశం మేరకు పరిషత్ లో యువ విభాగమైన, సేవా సురక్ష సంస్కార్ అనే గేయ వాక్యాలను అనుసరించి పని చేసే ‘భజరంగ్దళ్” ఆధ్వర్యంలో ఈనెల 23 నుండి 30వ తేదీ వరకు “సేవా సప్తాహము” పేరుతో దళిత వాడల్లో,  బడుగు బలహీన వర్గాల వారి నివసించే ప్రదేశాలలో ఎవరికైతే ఖరీదైన వైద్యం అందుబాటులో లేదో అటువంటి చోట “ఉచిత వైద్య శిబిరాలు” నిర్వహించాలన్న ఆదేశం మేరకు కర్నూలు జిల్లా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో కొండారెడ్డి నగర్, శ్రీ భవానీ శంకర దేవాలయము, కర్నూలు నందు ఈరోజు 30/6/24, ఆదివారం న జరిగిన “ఉచిత వైద్య శిబిరం” లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోమిశెట్టి వెంకటరామయ్య తెలియజేశారు.కర్నూలు జిల్లా అధ్యక్షులు గోరంట్ల రమణ అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ విశ్వ హిందూ పరిషత్ “షష్ఠ్యబ్ది” ఉత్సవాల్లో భాగంగా  (60 సంవత్సరాలు,1964 – 24) బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారనీ,రాబోయే షష్టిపూర్తి సందర్భంగా జిల్లా సేవా విభాగం ఆధ్వర్యంలో ఒక మెగా వైద్యశిబిరము,రక్తదాన శిబిరము నిర్వహిస్తామనీ,తేదీ త్వరలో తెలియజేస్తామని అన్నారు.బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాపరెడ్డి మాట్లాడుతూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం లో భాగంగా గత సంవత్సరం ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటం కోసం చెట్లు నాటే కార్యక్రమం,అటు పోయిన సం. మాదకద్రవ్యాలకు,మత్తుపదధార్థాలకు బానిసలైన యువకులకు సరైన కౌన్సిలింగ్ ఇచ్చి నషాముక్తభారత్ పేరుతో వారి ఆ జాడ్యం నుండి వేరుచేశామని ఈ సం.ప్రజారోగ్యాన్ని ముఖ్యంగా బడుగు , బలహీన వర్గాల వారు నివశించే కాలనీల్లో అల్లోపతి,ఆయుర్వేదం,హోమియోపతి వైద్య శిబిరాలు నిర్వహించాలన్న సంకల్పం తో ఈ రోజు ఈ కొండారెడ్డి నగర్ నందు నగరంలోని ప్రముఖ వైద్యులచే ఈ ఉచిత వైద్యశిబిరం నిర్వహించామని తెలియజేశారు. ఈ ఉచత వైద్యశిబిరంలో నగరంలోని ప్రముఖ వైద్యులు ఉచిత సేవను అందించారు వారిలో ప్రముఖ ఊపిరితిత్తుల వైద్యులు డాక్టర్ మోక్షేశ్వరుడు , ఎముకల వైద్య నిపుణులు శ్రీకర్ గారు, కాన్సర్ వైద్యనిపుణులు డాక్టర్ వాసురెడ్డి (వీ.ఆర్.ఆసుపత్రి) కంటి వైద్యం నిపుణులు డాక్టర్ రాజశేఖర్ గారు,(మాడ్రన్ ఐ హాస్పిటల్స్), చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ కే. జి. శరత్చంద్ర, స్త్రీ వ్యాధి నిపుణులు డాక్టర్ పవిత్రా రెడ్డి, రక్తపరిక్షల నిపుణులు డాక్టర్ నరేష్  (భారతీ డయాగ్నస్టిక్స్ సెంటర్) హియర్ జాప్ కంపెనీ వారిచే వినికిడి పరిక్షలు, వంటి వారు ఉచితంగా సేవలందించారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కోశాధికారి సందడి మహేశ్వర్,రాష్ట్ర మాతృ శక్తి కన్వీనర్ గౌరి, విభాగ్ బజరంగ్ దళ్ కన్వీనర్ నీలి నరసింహ, జిల్లా సహకార్యదర్శులు గోవిందరాజులు, గూడూరు గిరిబాబు,జిల్లా బజరంగ్ దళ్ కన్వీనర్ మీనుగ రాజేష్, జిల్లా మాతృ శక్తి కన్వీనర్ జంపాల రాధిక,కోశాధికారి అయోధ్య శ్రీనివిసరెడ్డి, టీ.టీ.డీ.ధర్మప్రచార పరిషత్ జిల్లా కన్వీనర్ వెంకటరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ కర్నూలు నగర అధ్యక్షులు టీ.సీ.మద్దిలేటి, వెంకటేశ్వర స్వామి ప్రఖంఢ అధ్యక్షులు మేడం రాఘవేంద్ర కృష్ణ, కార్యదర్శి కరణం సుధాకర్, బజరంగ్ దళ్ కన్వీనర్ తిమ్మారెడ్డి,రాజు, చంద్ర,టైగర్ రాము,అపర్ణ,  వెంకటేశ్వర్లు, మెడికల్ రెప్ శివకుమార్ లాల్, రంగస్వామి, వరసిద్ధి వినాయక ప్రఖంఢ అధ్యక్షులు  అయోధ్య చలపతి,బాబూరావు, సంజీవ రాయుడు, జే.పీ.సింగ్, రక్షిత్, రాము,భూపాలాచారి, కర్నూలు గ్రామీణ ప్రఖంఢ బజరంగ్ దళ్ కన్వీనర్ పరశురాముడు, తదితరులు పాల్గొన్నారు.

About Author