కందుకూరి పురస్కార గ్రహీతలను సత్కరించిన మాజీ రాజ్యసభ సభ్యులు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నిన్న విజయవాడలో కందుకూరి విశిష్ట పురస్కారం అందుకున్న ఐదు మంది కళాకారులను మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సత్కరించి అభినందించారు. ఈరోజు తన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉగాది పురస్కారాలు, కందుకూరి పురస్కారాలు టీజీవి కళాక్షేత్రానికి లభించడం సంతోషం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఐదు కందుకూరి విశిష్ట పురస్కారాలు టీజీవి కళాక్షేత్రానికి రావటం విశేషం అన్నారు. అవార్డులు సాధించడానికి తగిన ప్రోత్సాహం కళాక్షేత్రం ఇస్తుందన్నారు. కార్యక్రమంలో టీ జీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కార్యదర్శి మహమ్మద్ మియ, కె.వి రమణ, పి రాజారత్నం తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలు గాండ్ల లక్ష్మన్న, జీవి శ్రీనివాస్ రెడ్డి,ఎర్రమ పాండురంగయ్య, ఎమ్మార్ రాధిక వనారస మంజులను ఆయన అభినందించి చంద్రబాబు జన్మదిన వేడుకలలో వారికి విశేష సత్కారం చేస్తామన్నారు.