ఆంధ్రజ్యోతి బ్యూరో జీ.వీ.ఎస్.ఎన్ రాజుకి పితృవియోగం
1 min read
ఆంధ్రజ్యోతి బ్యూరో జీ.వీ.ఎస్.ఎన్ రాజుని పరామర్శించిన ఏపీడబ్ల్యూజే ఎఫ్ నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు జిల్లాఆంధ్రజ్యోతి బ్యూరో జి.వి.ఎస్.ఎన్ రాజు కి ఇటీవల పితృవియోగం జరిగింది,సోమవారం ఏలూరుజిల్లా ఏపీ డబ్ల్యు జె ఎఫ్ కమిటీ సభ్యులు రాజు స్వగృహానికి వెళ్లి ఆయనను కలిసి ఆయన తండ్రి అకాల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ పెద్ద దిక్కుని కోల్పోవడం బాధాకరమని ధైర్యంగా ఉండాలని తండ్రి చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు, ఏలూరుజిల్లా ఎ పీ డబ్ల్యూ జె ఎఫ్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ జభీవుల్లా,ఉపాధ్యక్షులు ఎస్ రుషి, టి వెంకట్రావు,దర్శి సత్యనారాయణ,యర్రా జయదాస్, చింతపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.