10వ తరగతి ఫలితాల్లో మాంటిస్సోరి విజయకేతనం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నేడు వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో స్థానిక ఏ-క్యాంపులోని మాంటిస్సోరి పాఠశాల విద్యార్థులు 142 మంది పరీక్షకు హాజరై, అత్యధిక మార్కులతో విజయకేతనం ఎగురవేశారు. పి. అఘ్ర అల్మస్ 600 మార్కులకు గాను 591 మార్కులతో పాఠశాలలో ప్రథమ స్థానంలో, ఎస్. షాబాజ్ నేహాన్ 590 మార్కులతో ద్వితీయ స్థానంలో, జి. సాయి చైతన్య 585 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని పాఠశాల కరస్పాండెంట్గారు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రమాజ్యోతి, సమన్వయకర్తలు శ్రీమతి కళ్యాణిగారు మరియు శ్రీ లక్ష్మీకాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.