దొంగల బీభత్సం..బంగారు నగదు అపహరణ
1 min read
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
నందికొట్కూరు, న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ఇంటిలో దొంగలు బీభత్సం సృష్టించారు.పట్టణంలోని అల్లూరు రోడ్డు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా బబీజేపీ జిల్లా కార్యదర్శి గూడూరు రవికుమార్ రెడ్డి ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఇంటి యజమాని తెలిపారు. యజమాని రవికుమార్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు వారి బంధువుల పెళ్లి కార్డులు పంచడానికి మంగళవారం ఉదయం తెలంగాణకు వెళ్లి మూడు రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చారు.భార్య రజిత ఒక్కరే ఇంటి దగ్గర ఉండడంతో రాత్రి వారి బంధువుల ఇంటిలో నిద్రించడానికి వెళ్లారు.ఇది అదునుగా చూసుకున్న దొంగలు మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బీరువా పగలగొట్టి వాటిలో ఉన్న 250 గ్రాములు వెండి,నాలుగు గ్రాములు బంగారం ఉంగరం,38 వేల నగదు అపహరించినట్లు భార్య భర్తకు సమాచారం ఇవ్వడంతో గురువారం ఉదయం నందికొట్కూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో రవికుమార్ రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.