మారిన వెంకట్రావు సేవలు అజరామరం
1 min read
సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్న కృష్ణ చైతన్య,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్,ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్
భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన పలువురు సిపిఐ నాయకులు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు 15వ డివిజన్ సీనియర్ సభ్యులు జట్లు లాగుడుమండ్ల కార్మిక సంఘ నాయకులు మారిన వెంకటరావు కొద్దిసేపటి క్రితం అనారోగ్య సమస్యలతో మరణించారు.సమాచారం తెలుసుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్, సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్, ఏరియా కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, గొర్లి స్వాతి ఎన్ ఎఫ్ ఐడబ్ల్యు జిల్లా కార్యదర్శి మన్న వ యామిని, కొండేటి రాంబాబు,వాకాడ రాజారావు తదితరులు మారిన వెంకట్రావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాల వేసి, పార్టీ జెండా కప్పి జోహార్ కామ్రేడ్ మారిన వెంకట్రావు,సాధిస్తాం మారిన వెంకటరావు ఆశయాలను అంటూ నినాదాలు ఇచ్చి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డేగా ప్రభాకర్ మాట్లాడుతూ మారిన వెంకట్రావు జట్లు లాగుడుబండ్ల సంఘ నాయకుడిగా సంఘ అధ్యక్షుడిగా అనేక సంవత్సరాలు సేవలు అందించారని కమ్యూనిస్టు పార్టీ 15వ డివిజన్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఏటీసీ నాయకునిగా కార్మిక వర్గ పక్షాన జరిగిన ప్రతి ఉద్యమంలోనూ మారిన వెంకట్రావు నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మారిన వెంకట్రావు అకస్మాత్తుగా మనకు భౌతికంగా దూరం కావడం ఏలూరు నగరంలో ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలకు కమ్యూనిస్టు పార్టీ ఉద్యమానికి తీరని లోటని వారి మరణానికి సంతాపాన్ని వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ మారిన వెంకట్రావు హమాలీ కార్మికుడిగా ఏలూరు నగరంలో పనిచేస్తూ ఎందరికో సభ్యత్వం ఇచ్చి వారిని కమ్యూనిస్టు పార్టీ సభ్యులుగా మలచడంలో అభిరావాలమైన కృషిని చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు ఆయన చేసిన సేవలను పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఏలూరు నగరంలో కార్మిక వర్గ హక్కుల కోసం జరిగే ఉద్యమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.