ప్రతి ఒక్కరూ అవయవ దానం పై అవగాహన కలిగి ఉండాలి
1 min read
– లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.
కర్నూలు, న్యూస్ నేడు: అవయవ దానంపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించడానికి విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని లయన్స్ జిల్లా మాజీ అడిషనల్ డిస్టిక్ క్యాబినెట్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నైస్ కంప్యూటర్స్ కార్యాలయంలో నేడు అవయవదానం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు .ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేకంగా బ్రెయిన్ డెడ్ అయిన సందర్భంలో అవయవదానం చేయడం ఎలా ,ఎలా నమోదు చేసుకోవాలి పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ కార్యదర్శి లయన్ టి. గోపీనాథ్, గౌరవాధ్యక్షులు లయన్ మహేంద్ర ,లయన్స్ సభ్యులు కేడీజే బాబు, లయన్ మంజునాథ్ ,ఉపాధ్యాయులు కేకే దామోదర్ రావు, కె . రాజగోపాల్ ,కే. శ్రీనివాసులు, యువతీ యువకులు పాల్గొన్నారు.