కన్నుల పండుగగా తన్విక ఆభరణాల కలెక్షన్స్
1 min read
ప్రత్యేక ఆఫర్లలో నారీ మణులకు ఆకర్షణగా డైమండ్స్,గోల్డ్&జ్యువలరీ
అక్షయ తృతీయ వేడుకలు పురస్కరించుకొని ఈ ఆఫర్లు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అక్షయ తృతీయ పార్వదినని పురస్కరించుకొని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ ప్రత్యేక ఆఫర్లను అందించడం అభినందానియమని కొనుకోలు దారులు తెలిపారు. అక్షయ తృతీయ ను పురస్కరించుకుని, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ‘డివైన్’ బ్రాండ్ కింద ‘తన్విక’ అనే కొత్త ఆభరణాల సేకరణలను మంగళవారం కొనుగోలు దారులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ అక్షయ తృతీయను పురస్కరించుకొని తమ కస్టమర్లకు విలువ, నమ్మకం చిరస్మరణీయంగా మార్చడానికి రూపొందించిన ప్రత్యేకమైన ఆఫర్ లను మలబార్ అందిస్తోందన్నారు. అక్షయ తృతీయ వేడుకల్లో భాగంగా, మలబార్ గోల్డ్ & డైమండ్స్ బంగారు ఆభరణాల తయారీ ఛార్జీలపై 25శాతం, విలువైన రాళ్ళు, అన్‌కట్ డైమండ్ ఆభరణాల తయారీ ఛార్జీలపై 25శాతం, వజ్రాల విలువపై 25శాతం,తగ్గింపును అందిస్తుందన్నారు. ఆభరణాలలో పెట్టుబడి పెట్టడానికి వినియోగదారులకు అవకాశాన్ని కల్పిస్తుందన్నారు. వినియోగదారులు బంగారం, వజ్ర ఆభరణాలన మొత్తం విలువలో కనీసం 10శాతం చెల్లించి తమ ఆభరణాలను బుక్ చేసుకోవచ్చునన్నారు. బంగారం ధరల పెరుగుదల నుండి రక్షణ పొందవచ్చునన్నారు. ఆభరణాల ధర బుక్ చేసిన రేటు లేదా ప్రస్తుత మార్కెట్ రేటు – ఏది తక్కువైతే అది – కస్టమర్లకు అందించడం జరుగుతుందన్నారు. భక్తి స్ఫూర్తిని జరుపుకునే డిజైన్‌లను కలిగి ఉందన్నారు. తన్విక’ ఆభరణాలు అద్భుతమైన కొత్త డిజైన్‌లను అందిస్తుందన్నారు. అనంతరం స్టోర్ హెడ్ జామలుద్దీన్ మాట్లాడుతూ అక్షయ తృతీయ సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉందన్నారు. మలబార్ గోల్డ్ మరియు డైమండ్స్ కస్టమర్లకు ప్రత్యేకంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకునమన్నారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యతకు అనుగుణంగా వినియోగదారులు ఆలోచించకు తగినట్టుగా బంగారు ఆభరణాలను, వజ్ర భరణాలను కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తునమన్నారు. ఈ కార్యక్రమంలో స్టోర్ మేనేజర్ ప్రేమ్ కుమార్,మార్కెటింగ్ మేనేజర్ రాజు,సేల్స్ మేనేజర్స్ రాములు,అమీన్, పలువురు కొనుకోలుదారులు పాల్గున్నారు.