కార్మిక చట్టాల పరిరక్షణ కు ఉద్యమాలు చేపడుదాం..
1 min read
పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించిన వివిధ రంగాల కార్మిక సంఘాలు
కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య
పత్తికొండ, న్యూస్ నేడు: కార్మిక చట్టాల పరిరక్షణకు ఉద్యమాలు చేపడుదామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో 139 వ మే డే వేడుకలను పత్తికొండ లో ఘనంగా నిర్వహించారు. ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి పట్టణ పురవీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ కూడలి వరకు భారీ కార్మిక ప్రదర్శన చేపట్టారు. సిపిఐ ఆఫీస్ ఎదురుగా ఏఐటియుసి పతాకాన్ని ఎన్. కృష్ణయ్య ఆవిష్కరించగా, అంబేద్కర్ సర్కిల్ కూడలిలో ఏఐటియుసి పతాకాన్ని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు కాంతమ్మ ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ సర్కిల్ కూడలిలో ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు నెట్టికంటయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, అమెరికాలోని చికాగో నగరంలో 1886 లో మొట్టమొదట ఆవిర్భవించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటియుసి అన్నారు. ఏఐటీయూసీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటూ కార్మిక హక్కుల సాధనకై అనేక ఉద్యమాలు చేపట్టడం జరిగిందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులను కాలరాసే విధంగా 44 కార్మిక చట్టాలను కేవలం నాలుగు లేబర్ కోడ్ లు గా కుదించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రమైన పత్తికొండలో లేబర్ కార్యాలయాన్ని ఏర్పాటు .
