ప్రతి నియోజకవర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఈ పార్కు..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు ,న్యూస్ నేడు: రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఎం.ఎస్.ఎం.ఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన ఎంతో గొప్పదని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నారంపేట గ్రామంతో పాటు మరో 10 చోట్ల రూ.216 కోట్లతో అభివృద్ధి చేసిన ఎం.ఎస్.ఎం.ఈ పార్కులను సీఎం చంద్రబాబు నాయుడు వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం రూ.376 కోట్లతో అభివృద్ధి చేసేందుకు 39 ఎం.ఎస్.ఎం.ఈ పార్కులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పాల్గొని ప్రసంగించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఎం.ఎస్.ఎం.ఈ పార్కు ఉండటం వల్ల ఆ ప్రాంతానికి పరిశ్రమలు రావడంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. కేవలం సీఎం చంద్రబాబు నాయుడును చూసి రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.