అవినీతిని ప్రశ్నిస్తే దాడుల??
1 min readబుగ్గన ఎన్ని దాడులు చేసినా అవినీతిని బయటపెట్టి తీరుతాం: నాగేశ్వరావు యాదవ్
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన మంత్రి పదవి కాలంలో చేసిన అవినీతి అక్రమాలను బయటపెట్టి తీరుతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ హెచ్చరించారు. ఆయన ప్యాపిలిలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. బుగ్గన అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన అవినీతిని ప్రశ్నిస్తే దాడులు చేశాడని ఇప్పుడు కూడా ఇంకా అధికారంలో ఉన్నానన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన అనుచరులు చేసిన దాడుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేక విధాలుగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్నికల్లో తర్వాత కూర ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన వైసీపీ నేతలు అందుకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు కొనసాగించడం శోచనీయమన్నారు. బుగ్గన చేస్తున్న దాడులను తాము తిప్పి కొట్టడం తమ కార్యకర్తలకు క్షణకాలమేనని ఆయన అన్నారు. దాడులకు ప్రతి దాడులు చేయటం తెలుగుదేశం సంస్కృతి కాదని తమను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డిలు నిలువరిస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత డోన్ బేతంచెర్ల మండలాలతోపాటు తాజాగా ప్యాపిలి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వైసీపీ గుండాలు దారుణంగా దాడి చేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు ఇది కేవలం బుగ్గన అవినీతిని ప్రశ్నించడంతో పాటు లేని అభివృద్ధిని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నావని ప్రశ్నించడం వంటి చర్యల కారణంగానే ఈ దాడులు జరుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దాడులు ఆపకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం ఏంటో రుచి చూడాల్సి వస్తుందని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బెదిరించడం దాడులకు పాల్పడినంత మాత్రాన ఆయన అవినీతి ఏంటో ప్రజలకు చెప్పక మానమని ఆయన అన్నారు. గత ఐదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పులపాలు చేయడమే కాకుండా అబద్దాలతో డోంట్ ప్రజలను మభ్య పెట్టాడని ఆగ్రామ్ చెందారు. కోట్ల కుటుంబం మంచితనం నీతి నిజాయితీ కారణంగానే డోన్ నియోజకవర్గం లో బుగ్గన అనుచరులు వైసీపీ గూండాలు బతికిపట్టగడుతున్నారని ఆయన తెలిపారు ఒక మాట కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చెప్తే వైసీపీ గుండాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు ఎలా ఉంటాయో రుచి చూపించగలమని హెచ్చరించారు అయితే ప్రత్యర్థులపై దాడులు చేయటం తమ పార్టీ విధానం కాదని సంయమనం వహించి చట్టబద్ధంగా వ్యవహరించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ల వల్లనే తాము శాంతియుతంగా ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తొప్పెల శ్రీనివాసులు బీసీ సెల్ నంద్యాల అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్ నియోజకవర్గం నాగేంద్ర చల్లా వీరాంజనేయులు కొంగనపల్లి మధు తెలుగు యువత మండల అధ్యక్షుడు కోదండరామయ్య యాదవ్ r. మల్లికార్జున గండికోట పెద్ద రామాంజనేయులుజక్కిరెడ్డి రామిరెడ్డి బ్యాంక్ శీను చల్ల అనుదీప్ హర్ష కలచట్ల మాజీ సర్పంచ్ రామాంజనేయులు ప్రసాద్ రవి రంగస్వామి రాజా వెంకటం పల్లి మోహన్ ప్రకాష్.