నిందితులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి
1 min read– దీనికి పోలీస్ శాఖ నిర్లక్ష్యం: న్యాయవాదులు
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఉ.11 గం.కు నందికొట్కూరు న్యాయవాదుల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించడమైనది.ఈ సమావేశం నందు గత ఆదివారం 7.7.2024 (నేటికి పది రోజులు) తేదీన నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని ముచ్చుమర్రి గ్రామంలో అదృశ్యమైన మైనర్ బాలిక వాసంతి(9)ఆచూకీ ఇంతవరకు కనిపెట్టలేక పోవడం పోలీస్ శాఖ మరియు ప్రభుత్వ వైఫల్యం అని భావించడమైనది.ఈవిషయం న్యాయవాదులు అందరూ ముక్టకంఠతో ఖండించడమైనది.నేరస్తులుగా భావిస్తున్న వ్యక్తులకు లై డిటేక్టర్ పరీక్షలు నిర్వహించి సమాచారం రాబట్టాలని నందికొట్కూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు జె వెంకటరాముడు డిమాండ్ చేశారు.ఈ వైఫల్యం వెనక రాజకీయ జోక్యం ఏమైనా వున్నదేమోనన్న అనుమానం వ్యక్తం చేయడమైనది.ఈ అనుమానస్పద కేసును త్వరగా చేధించి బాధిత కుటుంబానికి న్యాయం చేకూర్చాలని కోరుతూ గౌరవ ఆంధ్రప్రదేశ్ హై కోర్టు వారి ముందు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగిందని ఆయన తెలిపారు.