NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మృదుమ‌ధురంగా సాగిన మువ్వల స‌వ్వడి

1 min read

నాలుగు నాట్యరూపాల్లో 150 మందికిపైగా క‌ళాకారుల ప్రద‌ర్శన‌లు

ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు నృత్యాలు

నాట్యక‌ళ‌కు తిరిగి ప్రాణం పోశార‌న్న క‌ళాకృష్ణ‌, వినోద్ అగ‌ర్వాల్‌

హైద‌రాబాద్‌, న్యూస్​ నేడు: ఒక‌వైపు కూచిపూడి.. మరోవైపు క‌థ‌క్‌.. కొంద‌రేమో భ‌ర‌త‌నాట్యం.. మ‌రికొంద‌రు ఆంధ్రనాట్యం.. ఇలా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రశ‌స్తి చెందిన నృత్యరూపాల‌న్నీ ఒక్కచోట కొలువుదీరాయి. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. 20 అకాడ‌మీల‌కు చెందిన 150 మందికి పైగా నృత్య క‌ళాకారిణులు, కళాకారులు వీట‌న్నింటినీ అద్భుతంగా ప్రద‌ర్శించారు. వీట‌న్నింటికీ బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌లోని సెస్ ఆడిటోరియం వేదికైంది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ మువ్వల‌స‌వ్వడి ప్రతిధ్వనించింది. సాంస్కృతిక క‌ళారూపాల‌కు, భార‌తీయ సంప్రదాయ నృత్యానికి పెద్దపీట వేసే మ‌హోన్నత ల‌క్ష్యంతో ఏర్పాటుచేసిన అమృత క‌ల్చర‌ల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వినోద్ అగ‌ర్వాల్‌, కేంద్ర సంగీత‌, నాట‌క అకాడ‌మీ అవార్డు గ్రహీత‌, ఆంధ్రనాట్య గురువు క‌ళాకృష్ణ గౌర‌వ అతిథులుగా హాజ‌రయ్యారు. ఇంత‌మంది క‌ళాకారుల‌ను ఒక్క చోట‌కు తీసుకురావ‌డం, ఇన్ని ర‌కాల క‌ళారూపాల‌ను ఒకే వేదిక‌పై ప్రద‌ర్శింప‌జేయ‌డం ద్వారా అంద‌రినీ అల‌రించ‌డంతో పాటు.. నాట్యక‌ళ‌కు తిరిగి ప్రాణం పోశార‌ని నిర్వాహ‌కులైన అమృత క‌ల్చ‌ర‌ల్ ట్రస్టును వారు ప్రశంసించారు. సాయంత్రం 5 గంట‌ల‌కు నిర్వహించిన అవార్డుల బ‌హూక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో ముందుగా న్యాయ నిర్ణేత‌లు శిరూషా అమ‌ర్‌, ప‌ద్మ దెందులూరి, వ‌న‌శ్రీ ప్రొద్దుటూరు, వీణా గ‌ణేశ్‌, సునీలా గొల్లపూడి, సుష్మా ఉద‌య్ మహంతి, చైత‌న్య కుసుమ‌ప్రియ‌.. తాము ఏయే అంశాల ఆధారంగా విజేత‌ల‌ను నిర్ణయించామో చెప్పారు. మొత్తం 20 అకాడ‌మీలు పాల్గొన‌డం, ఒక‌రికి మించి మ‌రొక‌రు త‌మ హావ‌భావాలు, ముద్రలు, నృత్య కౌశ‌లంతో వేదిక‌పై అద్బుతాలు సృష్టించార‌ని వారు ప్రశంసించారు. ముద్ర‌, అభియ‌నం, బృంద స్ఫూర్తి, ప్రేక్షకుల నుంచి స్పంద‌న, వ‌స్త్రాలంక‌ర‌ణ‌, డిజిట‌ల్ స్పాట్‌లైట్ లాంటి విభాగాల‌లో ప‌లువురికి అవార్డులు అందించారు. అమృత క‌ల్చర‌ల్ఇందులో దేశ‌వ్యాప్తంగా ఉన్న‌.. వివిధ నృత్యరీతుల‌కు చెందిన ప‌లువురు ల‌బ్ధప్రతిష్ఠులైన క‌ళాకారులు పాల్గొంటారు. ఇది క‌ళ‌లు సంస్కృతి, సంప్రదాయాల ఉత్సవంలా ఉంటుంది. ఇప్పుడు నిర్వహించిన మువ్వల స‌వ్వడి కార్యక్రమం కూడా.. దేశంలోని అన్ని కళారీతుల‌కు ప్రాతినిధ్యం వ‌హించింది. హైద‌రాబాద్‌లో ఆయా రీతుల క‌ళాకారుల‌కు మంచి అవ‌కాశాలు క‌ల్పించ‌డం, వివిధ నృత్య అకాడ‌మీల‌తో క‌లిసి ప‌నిచేయ‌డం, మ‌రింత‌మందిని వీటివైపు ఆక‌ర్షితుల‌య్యేలా చేయ‌డం మా ప్రధాన ఉద్దేశం. మువ్వల స‌వ్వడి కార్యక్రమం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని శాస్త్రీయ నృత్యానికి ప్రధాన కేంద్రంగా చేయాల‌ని భావిస్తున్నాం. ఇక్కడ చేసే ప్రతి ప్రద‌ర్శన భార‌తీయ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిధ్వనిస్తుంది” అని తెలిపారు.

About Author