కార్మికుల హక్కుల సాధనకై ఐక్య పోరాటాలు …
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: ప్రపంచ కార్మిక 139వ వారోత్సవాలు పురస్కరించుకొని జలదుర్గం గ్రామంలో సి. ఐ. టీ. యు జెండాను యు.టి.ఎఫ్ నాయకులు రామ్మోహన్ ఆవిష్కరించడం జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐటియు ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి ఎస్.ఎ. చిన్న రహిమాన్ డిప్యూటీ కార్యదర్శి పద్మశాలి శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ కార్మికులతో ఆనాడు కట్టు బానిసలుగా జరుగుతున్న తరుణంలో కార్మికులకు 8 గంటల పని విధానం కొరకు, 1886లొ అమెరికాలోని చికాగో నగరంలో , హే ,మార్కెట్లో యాజమాన్యం కు కార్మికులకు జరిగిన పోరాటంలోఆ మరులైన కార్మికుల రక్తతర్పణంతో ఉద్భవించినదే ఈ ఎర్రజెండా అని అన్నారు. ఈ మేడే దినోత్సవం అనగా ప్రపంచ కార్మికుల దినోత్సవం అని వారన్నారు, ఆనాడు కార్మికుల రక్త తర్పణం తో సాధించిన ఈ మేడే ప్రపంచవ్యాప్తంగా మేడే గా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అయితే ఈనాడు పెట్టుబడిదారులు వారి స్వలాభాల కోసం 8 గంటల పని విధానాన్ని రూపు మాసేందుకు పాలక ప్రభుత్వాలను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని కార్మిక శ్రామికుల శ్రమ దోపిడి చేయించుకోవడానికి ఎన్నో కుట్రలు పడుతున్నారన్నారు. రెండు సంవత్సరాల క్రితం10 కార్మిక రంగాల్లో పనిచేసే వారికి నెలకు 26 వేలు రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు జీవో జారీ చేసిన ఈ పాలకవర్గాలు పెడచెవిన పెడుతూ నిర్లక్ష్యంగా కార్మికు వ్యవస్థలు ముప్పు తిప్పలు పెడుతూ బెదిరింపులకు గురి చేయడం సరైనది కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్ యూనియన్ సీనియర్ నాయకులు జె. గంగాధర్, వీఆర్ఏ నాయకులు నబిరసుల్, ఆశా వర్కర్లు పిరంబి, లక్ష్మీదేవి, మధు, ఈశ్వరయ్య, నారాయణ, గౌడ మాసూం వలి, ప్రతాప్, కొట్టం భాష, ఎద్దుపేట భాష, గుండాల్ మహేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
