పెద్దహ్యట గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించండి.. ఏఐఎస్ఎఫ్
1 min readఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ గారికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు దస్తగిరి పెద్దహ్యట బస్సు సౌకర్యం కల్పించాలని వినతిపత్రం అందజేశారు.ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ
పల్లెవెలుగు వెబ్ హోళగుంద: ఆదోని డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ సానుకూలంగా స్పందిస్తూ ఆ రోడ్డు మార్గాలలో ఉన్న బస్సు సర్వీస్ లను విద్యార్థులకు అనుకూలంగా అతి తొందరలో బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తామని ఏఐఎస్ఎఫ్ నాయకులకు తెలియజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ మాట్లాడుతూ హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామం నుండి మండల కేంద్రానికి ఉన్నంత చదువులు చదువుకోవడానికి పాఠశాలకు కళాశాలలకు దాదాపు 40 మందికి పైగా విద్యార్థులు రోజు ప్రయాణిస్తున్నారు.పెద్దహ్యట గ్రామానికి రెండు ప్రధాన రోడ్డు రహదారి మార్గాలు ఉన్నాయి.గ్రామం నుండి 1.5.కిలోమీటర్ ప్రధాన రహదారికి నడుచుకుంటూ రావాలి.ప్రధాన రహదారి నుండి 7 కిలోమీటర్లు మండల కేంద్రానికి రోడ్డు మార్గం ఉంది.ఆలూరు–సులువాయి మీదుగా హోళగుంద కు ప్రధాన రహదారి ఉంది.మరో రోడ్డు మార్గం ఆలూరు–ఎల్లార్తి మీదగా హోళగుందకు రోడ్డు మార్గం ఉంది.ఈ రెండు రోడ్డు మార్గాలలో ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు రోజు నడుస్తున్నాయి. ఆలూరు సులువాయి మీదగా వచ్చే బస్సు సమ్మాతగెరి గ్రామం లోపలికి వెళ్లి తిరిగి ప్రధాన రహదారికి చేరుకుంటుంది ఆ రోడ్డు మార్గంలో ఉన్న పెద్దహ్యట గ్రామంలోకి బస్సు రావడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు నూతన రోడ్డు కూడా వేయడం జరిగింది కాబట్టి ఈ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా కోరుతున్నాం.ఈ రెండు రోడ్డు మార్గాలలో ఏదో ఒక రోడ్డు మార్గాన బస్సు సౌకర్యం కల్పించవలసిందిగా ఆదోని డిపో అధికారులను అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్)గా విద్యార్థులు గ్రామస్తులు తదితరులు కోరుతున్నారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి సతీష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ నాయకులు మల్లి విద్యార్థిని విద్యార్థులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.