భూగర్భ జలాలు పెంచేందుకే..ఫారం పాండ్
1 min read

వలసలు వెళ్లకుండా అందరికీ పనులు కల్పించండి
ఉపాధి సిబ్బందితో పీడీ వెంకటసుబ్బయ్య..
మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్ నేడు : భూగర్భ జలాలు పెంచేందుకే ప్రభుత్వం ఫారం పాండ్ గుంతలను తీసుకువచ్చిందని నంద్యాల జిల్లా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య అన్నారు. బుధవారం నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారికి పి.దశరథ రామయ్య ఆధ్వర్యంలో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామాల వారీగా ఉపాధి పనులు మరియు ఫారం పాండ్ వాటి గురించి ఫీల్డ్ అసిస్టెంట్లను అడిగి తెలుసుకున్నారు.గ్రామాల్లో ఎవ్వరూ కూడా వలసలు వెళ్లడానికి వీలులేదని ప్రతి ఒక్కరికీ పనులు కల్పించాల్సిందేనని పనులకు వచ్చే విధంగా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.ప్రభుత్వ లక్ష్యాలను అధిగమించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని సిబ్బందిని హెచ్చరించారు.ప్రతిరోజూ 4 వేల మంది కూలీలకు పనులు తప్పనిసరిగా కల్పించాలన్నారు.ఫారం పాండ్స్,కంపోస్ట్ పిట్స్, పశువుల నీటి తొట్లు, పండ్లతోటల పరిశ్రమల క్రింద మండలంలో వంద ఎకరాల పొలం గుర్తించి సోమవారం లోపు పూర్తి చేయాలని సిబ్బందితో అన్నారు.ఇండ్ల ముందు చిన్న గుంత తీసి వాటిలో చెత్తాచెదారం వేస్తూ వర్మీ కంపోస్ట్ తయారు చేసే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రాజెక్టు డైరెక్టర్ అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఓ నాగమ్మ ఈసీ షబాన, టెక్నికల్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

