కురువ విద్యార్థులకు ప్రోత్సహక బహుమతులు
1 min read
కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు
కర్నూలు, న్యూస్ నేడు: ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఆవరణంలోని ఎంపీపీ హాల్ నందు కురువ విద్యార్థిని విద్యార్థుల కు ప్రోత్సహక బహుమతులు 135 మందికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం గురువారం ప్రధాన కార్యదర్శి ఎం. కె.రంగస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కర్నూల్ పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు జిల్లా అధ్యక్షుడు పత్తికొండ శ్రీనివాసులు,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడిసె శివన్న సెట్కూర్ సీఈవో వేణుగోపాల్, కల్లూరు తహసీల్దార్ ఆంజనేయులు అమిలియో లక్ష్మి ప్రసాద్ చాపె పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు,జ్ఞాపిక,సర్టిఫికేట్, నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఇంతమంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు తమ చదువును ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఒకప్పటి గొర్రెల కాపరులుగా కాకుండా విద్యావేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు దేశం గర్వించే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు. ఐక్యంగా ఉండాలని పిల్లలను చదివించాలని ఐక్యమత్యంతో ఉంటే అన్ని సాధించుకుంటారని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో భానుశంకర్ రాజశేఖర్ గడ్డం రామకృష్ణ, సిట్రా సత్యనారాయణమ్మ, భానుశంకర్, కర్నూలు జిల్లా కురువ సంఘం ఉపాధ్యక్షులు పెద్దపాడు ధనుంజయ, తిమ్మాపురం ఉరుకుందు, కత్తి శంకర్, వేంకటేశ్వర్లు, కోశాధికారి కె. సి. నాగన్న మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీలీలమ్మ, అనితమ్మ, గౌరవ సలహాదారులు కె.కిష్టన్న ,పాలసుంకన్న,మదు చికెన్ మల్లికార్జున బి. సి.తిరుపాల్ ,వెంకటేశ్వర్లు, రేమట సర్పంచ్ వెంకన్న, అంపయ్య, పెద్దపాడు పుల్లన్న,నాగేంద్ర, ఎల్లయ్య, హనుమంతు,తదితరులు పాల్గొన్నారు.

