PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవయవదానంతో మరొకరికి ఆయువునిద్దాం

1 min read

లయన్స్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ బాల మద్దయ్య.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో అవగాహన క్యాంపెయిన్ లో భాగంగా ఆర్.ఆర్ హాస్పిటల్లో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు, లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ లయన్ డాక్టర్ బాల మద్దయ్య మాట్లాడుతూ అవయవదానంపై ప్రజల్లో ఉన్న అనుమానాలు అపోహాలను పోగొట్టడానికి ఈ అవగాహన కార్యక్రమం లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. న్యూరో సర్జన్, స్ట్రోక్ స్పెషలిస్ట్ డాక్టర్ రోహిత్ మాట్లాడుతూ బ్రెయిన్ డెడ్ దశలో ఉన్న వారి నుండి వారి కుటుంబ సభ్యుల అనుమతితో అవయవదానం ద్వారా 8 మందికి పైగా ప్రాణాలు కాపాడవచ్చు అన్నారు .లయన్స్ జిల్లా చైర్మన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ అవయవ దానం చేయడానికి ముందుకు రావాలని వయస్సు  తో నిమిత్తం లేకుండా ఎవరైనా అవాయ దానం చేయవచ్చని, కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి కాబట్టి అవయవదాన ధ్రువీకరణ పత్రాన్ని అందించే దాతృత్వం ఉన్నవాళ్లు కుటుంబ సభ్యులకు  తప్పనిసరిగా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, ఆసుపత్రి స్టాఫ్,పేషెంట్లు, లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం  అవయవదానానికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

About Author