NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీరు సాహెబ్ పేటలో..జనసేన కార్డుల పంపిణీ

1 min read

మిడుతూరు (నందికొట్కూరు) న్యూస్​ నేడు  :నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పీరు సాహెబ్ పేట గ్రామంలో జనసేన పార్టీ సభ్యత్వ కార్డులను గ్రామానికి చెందిన గుజ్జుల బలరాముడు అనే యువకుడు 20 జేఎస్పీ సభ్యత్వ భీమా ఐడెంటిటీ కార్డులను శనివారం పంపిణీ చేశారు.గత సంవత్సరం పార్టీ సభ్యత్వం చేసిన వారందరికీ అమరావతి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుండి కార్డులు వచ్చినట్లు బలరాముడు తెలిపారు. సభ్యత్వం చేసుకున్న వారికి అనుకోకుండా ప్రమాదవశాత్తు జరిగితే వారికి జనసేన పార్టీ ఐదు లక్షల రూపాయల బీమా అందిస్తుందని బలరాముడు మరియు గుడిపాడు ప్రభాకర్ తెలిపారు.తర్వాత ప్రతి సంవత్సరం సభ్యత్వం చేసుకున్నవారు రెన్యువల్ చేయాలని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో బి బలరాముడు,శివ,మధు, వెంకట నాయుడు,రమణ, శ్రీరాములు,ప్రవీణ్,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author