NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల బాలికల హక్కులను కాపాడడం మన అందరి బాధ్యత

1 min read

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్ కమిటీ మెంబర్ -లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్.

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని నైస్ యూత్ ఫర్ కల్చర్  అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్  మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక నైస్ కంప్యూటర్ సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైల్డ్ ఫ్రెండ్లీ లీగల్ సర్వీసెస్  కమిటీ మెంబర్ ,యునైటెడ్ కన్జ్యూమర్ రైట్స్  అండ్ లీగల్ రైట్స్ ఫౌండేషన్ ఏపీ స్టేట్ చైర్మన్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా పంపించబడుతున్న బాల కార్మికులు ఎదుర్కొంటున్న హానికరమైన ,మానసిక మరియు శారీరక సమస్యల గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్దేశించబడిందని, బాల కార్మిక నిషేధ నియంత్రణ చట్టం 1986 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను బాల కార్మికులు గా పంపించడం నిషేధమని, ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఏదైనా కర్మాగారం లేదా ప్రమాదకరమైన వృత్తులలో నియమించడాన్ని నిషేధించడం జరిగిందని  పిల్లల హక్కులు అయిన విద్యా హక్కు, ఆరోగ్య హక్కు  లను కాపాడడం మన అందరి బాధ్యత అన్నారు .అనంతరం చిన్నారుల హక్కులను గౌరవిస్తూ బాల కార్మికులను గుర్తించి అధికారులకు తగిన సమాచారం అందించి బాల కార్మిక వ్యవస్థనుంచి వారిని విముక్తి  కలిగించేలా ప్రయత్నంచేస్తామని  ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో  లయన్స్  క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు  విద్యార్థిని ,విద్యార్థులు పాల్గొన్నారు.

About Author