PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శానిటేషన్ కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులకు తక్షణమే పెండింగ్ వేతనాలు చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ సెక్రెటరీ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సోమవారం పత్తికొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య ఉద్యోగులు, సానిటేషన్ కార్మికుల సమస్యలు పై  సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా  ఏఐటియుసి  జిల్లా డిప్యూటీ సెక్రటరీ ఎన్ .కృష్ణయ్య ఏఐటియుసి తాలూకా నియోజవర్గ అధ్యక్ష కార్యదర్శులు జి. నెట్ కంటయ్య ఎం. రంగన్న ఏఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు బి.మాదన్నలు హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎన్ క్రిష్ణయ్య మాట్లాడుతూ,  శానిటేషన్ కార్మికులకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నప్పటికీ అ వేతనాలు కూడా నెల నెల సక్రమంగా ఇవ్వడం లేదన్నారు .శానిటేషన్ కార్మికులకు జీవో నెంబర్ 549 ప్రతి కార్మికులకు నెలకు 16 వేలు వేతనం ఇవ్వాల్సి ఉండగా తక్కువ జీతాలు ఇస్తున్నారని, ఐదు నెలలు గా జీతాలు చెల్లించుకుంటే వారి కుటుంబాలు ఎలా గడపాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కు జీవో నెంబర్ 43 ప్రకారం 11000 జీతం రావాల్సి ఉంటే తక్కువ జీతం ఇస్తున్నారని అన్నారు. వారు కూడా వేతనాలు సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే ఈఎస్ఐ కార్డులు ఇంతవరకు ఇవ్వలేదని, తక్షణమే పెండింగ్ జీతాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.కార్మికులకు నాలుగు వారాంతపు సెలవులు, క్యాజువల్ సెలవులు, జాతీయ పండుగ సెలవులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం లేదని అన్నారు.కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని,  అదేవిధంగా   ప్రభుత్వం కార్మికులకు కేటాయించిన సెలవులను తక్షణమే అమలు చేయాలని , కమ్యూనిటీ హెల్త్ సెంటర్  లో పనిచేస్తున్న ఉద్యోగులకు నెలనెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో ఆసుపత్రి ఉద్యోగ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు జి దేవయ్య ఎంజి ఆనంద్ కుమార్  శశి కళ, నరేష్, లక్ష్మి ,సుంకులమ్మ, విశాల,బాషా తదితరులు పాల్గొన్నారు.

About Author