NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీపీఎం పార్టీ నుండి నాగరాజు.. అక్బర్ బాషా ను బహిష్కరిస్తున్నాం

1 min read

డోన్​ , న్యూస్​ నేడు:  సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు నక్కి శ్రీకాంత్. డోన్ సిపిఎం పార్టీ డోన్ మండల కార్యదర్శిగా పనిచేస్తున్న కోయిలకొండ నాగరాజు మరియు తారక రామ్ నగర్ సిపిఎం శాఖ కార్యదర్శి అక్బర్ భాషను సిపిఎం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పార్టీ జిల్లా సభ్యులు నక్కి శ్రీకాంత్, సీనియర్ నాయకులు టి. శివరాం తెలిపారు. ఆదివారం సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మండల కార్యదర్శి కోయిలకొండ నాగరాజు శాఖ కార్యదర్శి అక్బర్ భాష పార్టీ నిర్ణయాలకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా వుంటూ,బయట పార్టీ వ్యతిరేక ప్రచారం నిర్వహించడమే కాకుండా పై కమిటీ నిర్ణయాలకు వ్యవహరించడం వలన వీరిని వెంటనే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇక నుండి డోన్ లో సీపీఎం  పార్టీ కి,ప్రజాసంఘాలకు కోయిలకొండ నాగరాజు,అక్బర్ బాషా కు, ఎలాంటి సంబంధం లేదని వారిని శాశ్వతంగా సిపిఎం పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు వారు తెలిపారు.

About Author