ప్రభుత్వ బాలురు పాఠశాల హెచ్ఎం పై చర్యలు తీసుకోవాలి
1 min readపల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థులను బాల కార్మికులుగా తయారు చేస్తున్నటువంటి ఎమ్మిగనూరు బాలురు ఉన్నత పాఠశాల హెచ్ఎం ను విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఈరోజు ఆర్ యు ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం ఈ సందర్భంగా ఆర్ యు ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం పటిష్టాత్మకంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే విద్యార్థులను పనులు చేయించడం దుర్లభమనిఅదేవిధంగా బడి ఈడు పిల్లలు బడిలో ఉండాలి ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుండి కూడా బడికి వెళ్ళనటువంటి విద్యార్థులను బడిలో చేర్పించే కార్యక్రమాలను జిల్లా విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు కష్టపడుతూ ఉంటే ఇక్కడ ఉండేటటువంటి హెచ్ఎం విద్యార్థులను పని చేయించడం చాలా బాధాకరమని విద్యార్థులు కలం పట్టాల్సినటువంటి చేతులతో పనిముట్లు పట్టేటటువంటి పరిస్థితి తీసుకొని రావడమంటే విద్య వ్యవస్థకే సిగ్గుచేటు అనిదీనిని ఖండించారు దీనిని బట్టి చూస్తే విద్యార్థులకు విద్యను బోధించకుండా విద్యార్థులకు పని ఎలా చేయాలో నేర్పిస్తున్నట్లుంది . అదేవిధంగా అక్కడ తీస్తున్నటువంటి పిచ్చి మొక్కల్లో విష పురుగులు ఉండినచో వాటి వలన విద్యార్థులకు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా కూడా విద్యార్థులను పనిచేయడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయమని దీనిపైన విద్యాధికారులు విచారణ జరిపి అక్కడ పనిచేస్తూ విద్యార్థి ప్రాణాలతోచెలగాటమాడుతున్నటువంటి హెచ్ఎం ని సస్పెండ్ చేయాలని వారు కోరారు లేనిపక్షంలో ఈ సమస్య పైన మరిన్ని ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్య ఎస్ ఎఫ్ నాయకులు రాజేష్ రామ,చంద్ర, తదితర నాయకులు పాల్గొన్నారు.