గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జాయింట్ కలెక్టర్
1 min readభోజన శాలలోని ఆహార పదార్ధాల నాణ్యత తనిఖీ
ఆహార నిల్వలా స్టాక్ రిజిస్టర్ పరిశీలన
పిల్లల ఆరోగ్యం,వైద్య సేవలపై ఆరా
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : బుట్టాయిగూడెం మండలంలోని బూసరాజుపల్లి గ్రామంలో వున్న గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను శనివారం జాయింట్ కలెక్టర్, ఇన్ చార్జి ఐటిడిఎ పివో పి. ధాత్రిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా భోజనశాలను పరిశీలించి అక్కడవున్న ఆహార పదార్ధాల నాణ్యతను పరిశీలించారు. వైరల్ ఫీవర్లతో బాధపడుతున్న విద్యార్ధులను కలిసి వారికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వ్యాధినిబట్టి అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అదే విధంగా త్రాగునీరు స్వచ్ఛంగా ఉండేలాగా ఎప్పటికప్పుడు ప్రిన్సిపాల్ పర్యవేక్షించాలని ఆదేశించారు. గురుకుల పాఠశాల ఆవరణచుట్టూ నీటి నిల్వలు లేకుండా చూడాలని పాఠశాలలో పారిశుధ్యాన్ని మెరుగుగా ఉంచాలని తెలిపారు. డాక్టర్లు విద్యార్ధుల ఆరోగ్య పరిస్ధితిపై వైద్య సేవలపై తరచూ పరిశీలన చేయాలన్నారు. విద్యార్ధుల తరగతులకు వెళ్లి విద్యార్ధులకు బోధిస్తున్న విద్యాబోధనలపై విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధుల హాజరురిజిష్టర్ ను, ఆహార నిల్వల స్టాక్ రిజిష్టర్ ను పరిశీలించారు. ఈ తనిఖీలో ఐటిడిఎ డిప్యూటీ డైరెక్టర్ మరియు ఎపివో వివిఎస్ నాయుడు, ఇన్ చార్జి డిప్యూటీ డిఎంహెచ్ఓ డా. సురేష్, డిప్యూటీ డివైఇఓ ఐటిడిఎ నీలయ్య, బుట్టాయిగూడెం ఇన్ చార్జి తహశీల్దారు రమేష్ తదితరులు పాల్గొన్నారు.