NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏలూరు లో తలపెట్టిన వైసీపీ యువత పోరు కార్యక్రమం

1 min read

ఎన్నికల హామీల్లో నిరుద్యోగ భృతి కాలయాపన చేస్తున్న కూటమి ప్రభుత్వం

జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి కి వినతి పత్రం అందజేసిన వైసిపి నాయకులు

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు : వైసీపీ జాతీయ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగం గా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం మరియు నిరుద్యోగ భృతి ఇస్తాం అని సంవత్సర కాలంగా మోసం చేస్తున్నందున వాటిని వెంటనే అమలు చేయాలనీ ఈరోజు ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి  వారి కార్యాలయం వద్ద వినతి పత్రం వైసీపీ నాయకులు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి కి అందజేశారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాష్ట్ర యువత వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిధార్థ రెడ్డి, రాష్ట్ర యువత అధ్యక్షులు జక్కంపూడి రాజ,ఏలూరు జిల్లా యువత అధ్యక్షులు కామిరెడ్డి నాని, ఏలూరు జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షులు దూలం నాగేశ్వర రావు మరియు ఏలూరు జిల్లా లో వున్నా నియోజకవర్గాల వైసీపీ కన్వీనర్ లు, మరియు వివిధ విభాగాల అధ్యక్షులు, కార్యకర్తలు, వైసీపీ అభిమానులు.

About Author