NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భక్తుల హనుమద్ నామస్మరణతో మార్మోగిన ఆలయం

1 min read

శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని  దర్శించుకున్న భక్తులు

స్వామివారికి సుప్రభాత సేవ, నిత్య అర్చన ప్రత్యేక పూజలు

వివిధ సేవల రూపేణ రూ:2,15,016/- లు ఆదాయం

1200 మంది భక్తులకు నిత్య అన్నదాన సత్రంలో ప్రసాద వితరణ

కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి చందన

ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్​ నేడు  : జంగారెడ్డిగూడెం మండలం,గురవాయిగూడెం గ్రామంలో తెల్ల మద్ది చెట్టు తొర్రలో  స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో తెల్లవారుఝామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాతసేవ,నిత్యార్చన పూజలు నిర్వహించారు.  అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.  స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారులుదీరి స్వామివారిని  దర్శించుకొని, మ్రొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల హనుమద్ నామస్మరణతో ఆలయం మార్మోగింది. భక్తులు  శ్రీస్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కులు  చెల్లించుకున్నారు.  ఆలయం వద్ద బొర్రంపాలెం ప్రాధమిక ఆరోగ్యకేంద్రం వారు వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పలువురు భక్తులు వైద్యసహాయం పొందారు. మద్యాహ్నం  వరకు  దేవస్థానమునకు వివిధ సేవల, విరాళాల  ద్వారా  రూ 2,15,016/-లు  సమకూరినది. సుమారు  1200  మంది   భక్తులకు  స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద   వితరణ  చేశారని దేవస్థానం కార్యనిర్వాహణాధికారిణి ఆర్.వి. చందన తెలిపారు.

About Author