విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాల లారీ తరలింపు
1 min readజండా ఊపి ప్రారంభించిన మేయర్ నూర్జహాన్ పెదబాబు
పదివేల మందికి భోజనం ప్యాకెట్స్ తయారు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి తయారు చేయించి పంపిస్తున్న ఆహార పదార్థాల లారీని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జండా ఊపి ప్రారంభించారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు శాసనసభ్యులు బడేటి చంటి పర్యవేక్షణలో విజయవాడలో వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి పూటకు పదివేల మందికి భోజనాలు తయారు చేయించి పంపిస్తున్నామన్నారు. సోమవారం మధ్యాహ్నానికి కావలసిన భోజనాలు ఉదయం పంపామన్నారు. గత 4 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలు కారణంగా విజయవాడ చుట్టుపక్క ప్రాంతాలు నీటిలో మునిగిపోయి సుమారు3 లక్షల మంది వరదల్లో చిక్కుకున్నారన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం చాలా వరకు తగ్గిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారన్నారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు పి.నారాయణ ఆదేశాల మేరకు శాసనసభ్యులు బడే చంటి పర్యవేక్షణలో మన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి 2 రోజులు పూటకు 10 వేల మందికి ఆహారం పంపిస్తున్నామ మన్నారు. రాత్రి 11 గంటల నుండి కమిషనర్ మధు ప్రతాప్, అదనపు కమిషనర్ సిహెచ్ చంద్రయ్య దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు.ఇంజనీరింగ్ సిబ్బంది,రెవిన్యూ,మెప్మా,శానిటరీ ఇన్స్పెక్టర్లు, డిఈలు,ఏఈలు,ఆర్ఐలు,పిఓ సెక్షన్ సిబ్బంది అందరు రాత్రి నుండి ప్యాకింగ్ ఏర్పాట్ల చేశారు. శానిటేషన్ పనులు నిమిత్తం ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ నుండి 150 మంది సిబ్బందిని విజయవాడ పంపించడం జరిగిందన్నారు. సాధారణ జనజీవన పరిస్థితులు వచ్చేవరకు సిబ్బంది అక్కడ పనులు నిర్వహిస్తారన్నరు. ఈ కార్యక్రమంలో డి ఈ కొండలరావు పిఓ కృష్ణమూర్తి,కార్పొరేటర్లు జున్నూరు కనక నరసింహారావు, సబ్బన శ్రీనివాసరావు, దేవరకొండ శ్రీనివాసరావు,నున్నా కిషోర్, ఈదిపల్లి పవన్, దారపు తేజ తదితరులు పాల్గొన్నారు.