కులం పేరుతో విద్యార్థులను దూషించిన హెచ్ఎంని సస్పెండ్ చేయాలి
1 min read– ఆర్ యు ఎస్ ఎఫ్, పీ ఎస్ యు
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : నందవరంమండలంపులిచింత గ్రామం ఎంపీయూపీ ప్రాథమిక పాఠశాల లో కులం పేరుతో ఆడపిల్లలను అసభ్య పదజాలంతో మాట్లాడినటువంటి హెచ్ఎం నరేష్ టీచర్ పవన్ ని సస్పెండ్ చేయాలనీ తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు ఆర్ యు ఎస్ ఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ పి ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను అందరిని సమానంగా చూడాల్సినటువంటి టీచర్లే విద్యార్థులు కుల వివక్షత పేరుతో దూషించడం అంటే చాలా సిగ్గుచేటు అని విద్యార్థుల మధ్య నువ్వు తక్కువ కులమని నీవు ఎక్కువ కులమని టీచర్లు చెప్పడం చాలా బాధాకరమైనటువంటి విషయమని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే కుల వివక్షత పేరుతో విద్యార్థుల పట్ల అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడడమంటే చిన్న విద్యార్థుల మనసులు ఎంత బాధపడి ఉండచని వీరికి లక్షల లక్షల జీతాలు ఇచ్చి విద్యార్థులను కులం పేరుతో దూషించడం ఏంటి అని ఇది పాఠశాల లేదంటే దేవాలయం మా శ్రావణమాసం పేరుతో ఎస్సీ విద్యార్థులను బీసీ విద్యార్థులను వేరుపరచడమేంటి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను విద్యార్థులు పాఠశాలకు ఆలస్యంగా వస్తే మాత్రం తీవ్రమైన బూతు మాటలతో అసభ్యకరమైనటువంటి పదజాలంతో పీకడానికి పోయినారా మాదిగ నాయనలారా ఎప్పుడు స్కూలుకి రావడం అని అనేటటువంటి మాటలతో విద్యార్థులు తిట్టడం జరుగుతుందిఅన్ని బి ఆర్ అంబేద్కర్ చిన్న వయసులో ఎదుర్కొన్న సమస్యలు ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు కాగా ఆయన మనకోసం రాజ్యాంగంలో అణగారిన వర్గాల కోసం కొన్ని చట్టాలను అమలు చేయడం జరిగింది కానీ ఆయన మరణించి కొన్ని సంవత్సరాలు అయినా కూడా ఆ కుల వివక్షత మాత్రం ఇలా వెలుగులోకి రావడం అంటే చాలా బాధాకరమైనటువంటి విషయమని వారు అన్నారు.ఇకనైనా జిల్లా విద్యాశాఖ అధికారులు దీనిపైన చొరవ తీసుకొని సమగ్ర విచారణ చేసి అక్కడ ఉండేటటువంటి హెచ్ఎం టీచర్ ని సస్పెండ్ వారి డిమాండ్ చేశారు లేనిపక్షంలో మరిన్ని ఉద్యమాలకు దారి తీస్తామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పూలచింత ప్రజలు రంగన్న మోష వసంత్ ఎలిష్ తదితరులు పాల్గొన్నారు.