NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నాటు సారా స్థావరాలపై దాడులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  నవోదయం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బంగారు పేటలోని నాటు సారా సావరాలపై దాడులు నిర్వహించడం జరిగినది ఈ దాడులలో కుమారు 1050 లీటర్ల నాటు సారా తయారీకి ఉపయోగపడు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది మరియు 20 లీటర్ల నాటు సారా కలిగివున్న ఒక మహిళను అరెస్టు చేయడం జరిగినది నీలి  షికారి లక్ష్మి (బంగారు పేట) ని అరెస్టు చేసి రిమాండ్కు పంపడమైనది తదుపరి నాటు సారా తయారు చేయడం రవాణా చేయడం అమ్ముట చట్టరీత్యా నేరమని తెలిపి నాటు సారాను పూర్తిగా మానుకోవాలని నాటు సారా లేని ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలియజేయడమైనది. ఈ దాడులలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాజశేఖర్ గౌడ్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ సుభాషిని, సబ్ ఇన్స్పెక్టర్ నవీన్  మరియు సిబ్బంది పాల్గొన్నారు.

About Author