ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే రామారావు ప్యానల్ ప్రమాణస్వీకారం
1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న లాయర్లు,జూనియర్ లాయర్లు, మహిళా లాయర్లు,మిత్రులు శ్రేయోభిలాషులు
పలువురు అడ్వకేట్స్ అసోసియేషన్ అభివృద్ధికి విరాళాలు
ఏలూరు బార్ అసోసియేషన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలి
అధ్యక్ష , కార్యదర్శులు విజ్ఞప్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఏలూరు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కొనే సీతారామారావు ఆయన ప్యానల్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ సంబరం అంబరాన్నంటింది, శుక్రవారం బార్ అసోసియేషన్ హాలులో అడ్వకేట్స్,అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో కొనే సీతారామారావు ప్యానల్ అంతా ఒక్కొక్కరుగా పదవీ ప్రమాణం చేశారు,నూతనంగా పదవీ ప్రమాణం చేసిన అధ్యక్ష కార్య వర్గాన్ని తోటి అడ్వకేట్స్ ,అభిమానులు పూల మాలలతో,శాలువాలతో ముంచెత్తిఅభినందించారు,ఈ కార్యక్రమం లో బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడితో బాటు అడ్వకేట్ ఏలూరి వెంకటేశ్వరరావు 50 వేలు,ఎవి నారాయణ 25 వేలు భవన విద్యుత్ సర్వీస్ పునరుద్ధరణకు ఆర్థిక సహకారం అందించారు,అంతకు ముందే ఈ సర్వీస్ పునరుద్ధరణకు అధ్యక్షుడు కొనే సీతారామారావు 1 లక్ష రూపాయలు ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్ ఎన్ కృష్ణారావు,జనరల్ సెక్రెటరీ నోముల రాముడు,జాయింట్ సెక్రెటరీ ఇబ్రహీం షరీఫ్, ట్రెజరర్ గండికోట సీతారామరాజు, స్పోర్ట్స్ అండ్ కర్చరర్ సెక్రెటరీ జి.విజయభాస్కర్, లైబ్రరీ సెక్రటరీ కె కృష్ణ కిషోర్, మహిళ ప్రెసిడెంట్ పి కనకదుర్గ భవాని ని, పేరుపేరునా అసోసియేషన్ సభ్యులను లాయర్లు,జూనియర్ లాయర్లు,మహిళలు అడ్వకేట్స్ మరియు అభిమానులు శ్రేయోభిలాషులు,మిత్రులు పలు శాఖలకు చెందిన ఉద్యోగులు శాలువాలు కప్పి పూల బొకేలు అందించి. భవిష్యత్తులో పలువురికి ఉపయోగపడే విధంగా ఏలూరు బార్ అసోసియేషన్ అభివృద్ధి బాటల వైపు నడిపించాలని ఆకాంక్షిస్తూ ఘనంగా సత్కరించారు. ఏలూరు వార్ అసోసియేషన్ సంఘం బలోపేతానికి ప్రతి ఒక్క సభ్యుడు, అడ్వకేట్స్ సహకరించాలని అధ్యక్ష,కార్యదర్శులు విజ్ఞప్తి చేశారు.

