మాజీ కౌన్సిలర్ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే..
1 min read

న్యూస్ నేడు ఆలూరు: ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం నగురూరు గ్రామంలో ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకడు, మాజీ కౌన్సిలర్ పగడాల గోవిందరాజులు అనారోగ్యంతో మరణించడం జరిగింది, ఈ విషయం తెలుసుకున్న ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబని ఓదార్చి పరామర్శించారు. మట్టి ఖర్చులకు 10వేల రూపాయలు ఆర్థిక సహాయంగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ, కన్వీనర్, ఎంపీపీ, కో కన్వీనర్, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు


