PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్రంలో జన రంజక పాలన..

1 min read

సర్పంచ్ లకు పుష్కలంగా నిధులు-దీపావళికి ఉచిత సిలిండర్లు

-త్వరలోనే అలగనూరు రిజర్వాయర్ పూర్తి-తలముడిపి ప్రజావేదికలో ఎమ్మెల్యే గిత్త..

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): అభివృద్ధిలో రాష్ట్రం జన రంజక పాలనలో ముందుకు వెళ్తుందని గత ప్రభుత్వం..ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయితే బాగా చేస్తుందో మీరే ఆలోచించాలని ప్రజల దీవెనలు పార్టీకి ఉండాలని “ప్రజావేదిక”లో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు. నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో శనివారం ఉదయం జరిగిన నూతన ప్రభుత్వ 100 రోజుల పాలన ప్రజావేదిక మరియు “ఇది మంచి ప్రభుత్వం”అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.  గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల పాలు అయిందని ఇప్పుడు చంద్రబాబు అధికారంలో రాగానే సంక్షేమంపై దృష్టి సారించి జనరంజక పాలన సాగిస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే యువతకు మెగా డీఎస్సీ తో 16,437 ఉపాధ్యాయపోస్ట్ ల భక్తికి నోటిఫికేషన్ విడుదల చేసిందని జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు ఇవ్వలేదని ఇప్పటికే అన్నా క్యాంటీన్లు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెలలోనే పింఛన్ల పెంపు దేశ చరిత్రలోనే ఇది ఒక సంక్షేమ చరిత్ర అని మండల టిడిపి కన్వీనర్ కాతా  రమేష్ రెడ్డి అన్నారు.పంచాయతీ నిధులు ఏకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు ఇస్తే పంచాయతీ నిధులను దొంగలించిన వ్యక్తి జగన్ అని చంద్రబాబు సంక్షేమమే ధ్యేయంగా అవినీతి ప్రభుత్వం జగన్ అయితే సంక్షేమ ప్రభుత్వం బాబుదే అని  ఎమ్మెల్యే కొనియాడారు.ఈ ప్రభుత్వం సర్పంచులకు నిధులు ఇవ్వడంతో సర్పంచులకు గౌరవం పెరిగిందని గత ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలయ్యారని ఏది మంచి ప్రభుత్వము మీరే నిర్ణయించుకోవాలని దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో సేవ చేయాలని అభివృద్దే ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు కలిసి అభివృద్ధికి నాతో కలిసి పని చేయాలని ఎమ్మెల్యే కోరారు.అలగనూరు రిజర్వాయర్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయించడం జరిగిందని వాటిని త్వరలో పూర్తి చేస్తామన్నారు.అనంతరం సీనియర్ నాయకులు వంగాల శివరామి రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చామని వెంటనే అమలు చేయాలని ఎస్ఆర్బిసీ కాలువలకు బ్రిడ్జిలు అంగన్వాడి స్కూలు మరియు వెటర్నరీ అసిస్టెంట్ ను మంజూరు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.బాబు వస్తే వర్షాలు రావని,వైసిపి నాయకులు విష ప్రచారం చేశారని ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో జలాశయాలు నిండి రాష్ట్రం సుభిక్షంగా ఉందని వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని అన్నారు.గ్రామంలో తిరిగి ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లను అతికిస్తూ ఆప్యాయంగా వృద్ధులను యువకులను పలకరిస్తూ ఎమ్మెల్యే ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి,తహసిల్దార్ శ్రీనివాసులు,ఈఓఆర్డి ఫక్రుద్దీన్,ఏడి శ్రీనివాసులు,ఏవో పీరు నాయక్,టిడిపి మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్ రెడ్డి,మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, గుండం సర్వోత్తమ్ రెడ్డి, స్వామి రెడ్డి జనసేన నందికొట్కూరు నాయకులు రవికుమార్,సంపత్ కుమార్ బిజెపి నాయకులు చల్లా దామోదర్ రెడ్డి,సంపంగి రవీంద్రబాబు,మనోహర్ రెడ్డి,నరసింహ గౌడ్,షబ్బు భాష పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *