లే ఔట్లు ప్లాట్లను క్రమ బద్ధీకరించుకోవచ్చు..
1 min read

పట్టణ ప్లానింగ్ అధికారి రంగస్వామి..
నందికొట్కూరు, న్యూస్ నేడు: అనుమతులు లేకుండా వేసిన అక్రమ లే ఔట్లను క్రమబద్ధీకరించుకోవచ్చని నందికొట్కూరు పట్టణ ప్లానింగ్ అధికారి రంగస్వామి అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణ మున్సిపాలిటీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం టీపీఓ రంగస్వామి మాట్లాడుతూ లే ఔట్లు ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించిందని పట్టణంలో వేసిన అనధికార అక్రమ లే ఔట్లకు వీటి ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 134 ఎంఏ&యుడీ మార్గదర్శకాలను జారీ చేస్తూ పురపాలక పరిపాలన శాఖ ఈనెల 26వ తేదీన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు.ఈ ఏడాది జూన్ 30 లోపు రిజిస్టర్ చేసి ప్లాట్లు వేసిన అనధికార లేఔట్లను వీటి ద్వారా క్రమ బద్ధీకరించుకోవచ్చని ప్రభుత్వం నిర్దేశించిన నియమాలను తప్పనిసరిగా పాటిస్తూ దరఖాస్తులను నమోదు చేసుకునివీటిని వినియోగించుకోవాలని టీపీఓ రంగస్వామి అన్నారు.

