విద్యార్థుల భోజనం.. నాణ్యతగా ఉండాలి..
1 min read

ఆం.ప్ర. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్
కర్నూల్, న్యూస్ నేడు: కర్నూల్ నగరంలోని 48వ వార్డులోని కారల్ మార్క్స్ నగర్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్ ను రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ సందర్శించి అక్కడి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు. ఆ తరువాత విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భోజనం రుచి, శుభ్రత, డైలీ మెనూ పై ఆరా తీశారు. విద్యార్థులకు పెట్టే భోజనంలో రాజీ పడకుండా నాణ్యత పాటించాలని ప్రభుత్వం ఇచ్చిన మెనూ తప్పనిసరిగా అమలు చేయాలని సిబ్బందికి సూచించారు. విద్య పట్ల, పాఠశాలలో అందుతున్న వస్తువులు, మధ్యాహ్న భోజనము పాఠశాలలలో ఆహార ఏర్పాట్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా మంత్రి టీజీ భరత్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ఈ సందర్భంగా ఆం.ప్ర. రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు సూరి మన్సూర్ అలీ ఖాన్ వెల్లడించారు.

